వేములవాడకు రూ. 3.68 కోట్ల ఇన్‌‌‌‌కం

  • 577 గ్రాముల బంగారం, 32 కిలోల వెండి

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి హుండీల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. మొత్తం 39 రోజులకు సంబంధించిన హుండీలను మంగళ, బుధవారాల్లో రాజన్న ఆలయంలోని ఓపెన్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లో లెక్కించారు. మొత్తం రూ. 3,68,61,000తో పాటు 577 గ్రాముల బంగారం, 32.500 కిలోల వెండి వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు. లెక్కింపులో ఈవో వినోద్‌‌‌‌రెడ్డి, కరీంనగర్ ఏసీ చంద్రశేఖర్‌‌‌‌ పాల్గొన్నారు.