3.50 లక్షల మెట్రిక్​​ టన్నుల ధాన్యం కొనుగోలు : కలెక్టర్​ రాజీవ్​గాందీ హన్మంతు

నిజామాబాద్​/ నందిపేట, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3.50 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు తెలిపారు. శుక్రవారం నందిపేట, డొంకేశ్వర్​ మండల కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల వద్ద రైతులు, అధికారులతో మాట్లాడి కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  అధికారుల పరస్పర సహకారంతో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు.  

రైతులకు చెల్లింపులు కూడా జరుగుతున్నాయని, డిసెంబర్​ మొదటివారంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. గురువారం నుంచి రైతుల ఖాతాల్లో రూ.500 బోనస్​ కూడా జమవుతున్నట్లు తెలిపారు. అనంతరం నందిపేట ఎండీడీఓ కార్యాలయంలో కుటుంబ సర్వే  డాటా ఎంట్రీ తీరును పరిశీలించారు. 

డొంకేశ్వర్​లో ఓపెన్​ జిమ్​ ఏర్పాటు చేయాలని వీడీసీ సభ్యులు, కాంగ్రెస్​  నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్​ ఆనంద్​కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావ్​, అయిలాపూర్​ పీఏసీఎస్ చైర్మన్​ మీసాల సుదర్శన్​ ఉన్నారు.