చైనాలో కారు బీభత్సం.. 35 మంది మృతి

బీజింగ్: చైనాలోని జుహై సిటీలో ఘోరం చోటుచేసుకుంది. ఓ స్పోర్ట్స్​ సెంటర్‌లో ఎక్ససైజ్ చేస్తున్నవారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో  35 మంది మృతి చెందారు. మరో 43మందికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్​ (62 ఏండ్ల వృద్ధుడు) ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇది ప్రమాదమా లేక దాడినా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.