విధుల్లో చేరిన కొత్త కానిస్టేబుళ్లు

కరీంనగర్ క్రైం,వెలుగు:  కరీంనగర్ కమిషనరేట్ కి నూతనంగా 349 మంది కానిస్టేబుళ్లను  కేటాయించగా శనివారం విధుల్లో చేరారు.   సివిల్ కానిస్టేబుళ్లు పురుషులు- 150 మంది, మహిళలు -86 , ఏఆర్  కానిస్టేబుళ్లు పురుషులు- 95,  మహిళలు 18 మంది విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అభిషేక్ మహంతి మాట్లాడుతూ..  ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలన్నీ  విధుల్లో  ఆచరించాలన్నారు. 

క్రమశిక్షణ తప్పనిసరి అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మీనారాయణ ,ఏవో మునిరామయ్య, ఏసీపీలు  శ్రీనివాస్ , విజయకుమార్ ఆర్ఐలు రజినీకాంత్ , జానీమియా, కుమారస్వామి , శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.