Good News : ఐదు అంటే 5 నిమిషాల్లోనే.. మీ ఫోన్ ఫుల్ ఛార్జింగ్..

సెల్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది.. ఎంతలా అంటే స్క్రీన్ టైం అనేది యావరేజ్ 5 గంటలకు చేరింది. అంటే 24 గంటల్లో.. ఐదు గంటలు ఫోన్ చూస్తున్నారు జనం.. ఇంతలా ఫోన్ వాడుకుంటే ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది కదా.. నిజమే గతంలో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 2, మూడు రోజులు వచ్చేది.. ఇప్పుడు మాత్రం ఫుల్ ఛార్జింగ్ పెడితే.. మధ్యాహ్నానికి మళ్లీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది వస్తుంది.. సరిగ్గా ఈ సమస్యకు పరిష్కారంగా.. సరికొత్త బ్యాటరీ, సరికొత్త ఛార్జర్ అందుబాటులోకి తీసుకొస్తుంది రియల్ మీ కంపెనీ.. ఆ విశేషాలు ఇలా..

>>> ప్రస్తుతం 80W, 120W, 210W ఛార్జింగ్ కెపాసిటీ ఛార్జర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
>>>  రియల్ మీ కంపెనీ.. 300W (వాట్స్) కెపాసిటీతో కొత్త ఛార్జర్లు తీసుకురాబోతున్నది.
>>> దీనికి తగ్గట్టుగానే త్వరలో రియల్ మీ విడదల చేయబోతున్న RealmeGT 7 Pro స్మార్ట్ ఫోన్ లో 5.000mAh బ్యాటరీ తీసుకొస్తుంది. 
>>> ఈ స్మార్ట్ ఫోన్ జస్ట్.. కేవలం 5 అంటే ఐదు నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. 
>>> జీరో నుంచి 50 శాతం ఛార్జింగ్ కోసం 3 నిమిషాల టైం తీసుకుంటే.. మిగతా 50 శాతం ఛార్జింగ్ కోసం కేవలం 2 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. అంటే 5 నిమిషాల్లోనే మీ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. 
>>> రియల్ మీ స్మార్ట్ ఫోన్ కంపెనీ గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ ఫ్రాన్సింగ్ వాంగ్ ఈ విషయాన్ని అధికారింగా వెల్లడించారు.
>>> రియల్ మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను 2024 చివర్లో మార్కెట్ లోకి విడుదల చేస్తాం అని.. ఆ స్మార్ట్ ఫోన్లలో ఈ బ్యాటరీ, ఛార్జర్లు ఉంటాయని వెల్లడించారు.

ALSO READ : మన IIT స్టూడెంట్ అద్భుతం : సూపర్ పవర్ షూస్ వచ్చేశాయ్..!

 

రియల్ మీ స్మార్ట్ ఫోన్ల పోటీదారు అయిన రెడ్మీ కూడా తన రెడ్మీ 12 డిస్కవరీ ఎడిషన్ లో 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొస్తుంది. అయితే ఈ ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీ మాత్రం 4.100mAhగా ఉంది.. ఇది 4 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అని చెబుతోంది.. రియల్ మీ మాత్రం బ్యాటరీ కెపాసిటీని 5,000mAhతో తీసుకొస్తుంది.. ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అని చెబుతోంది. 

సో.. కొత్త ఛార్జింగ్, బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న స్మార్ట్ ఫోన్లతో.. జనానికి ఛార్జింగ్ గోల తప్పుతుందా.. రాత్రంతా ఛార్జింగ్ పెట్టాల్సిన తిప్పలూ తప్పుతాయి..