Health Alert : చలికాలంలో.. పాత గాయాలకు కొత్తగా నొప్పులు ఎందుకొస్తాయి

పాత గాయాలు నయమైనప్పటికీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గత గాయం తాలూకూ నొప్పులు.. మళ్లీ బాధించవచ్చు. వాషిలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని ఆర్థోపెడిక్స్ డైరెక్టర్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ భోర్‌ చెప్పిన దాని ప్రకారం.. రోజువారీ కార్యకలాపాల వల్ల శరీరం తీవ్ర ఒత్తిడిని భరిస్తుందని, దీని వల్ల తరచుగా కండరాలు, కీళ్ల సమస్యలు రావచ్చు. మీరు కూడా ఈ తరహా కీళ్ళ సంబంధిత గాయాలను ఎదుర్కొంటున్నట్టయిటే శీతాకాలంలో ఈ పరిస్థితి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

  • చలి కాలంలో వాతావరణ పీడనం మారుతుంది. ఇది మీ శరీరంలోని నీటి స్థాయిలపై ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా మీ మోకాలు, చీలమండల చుట్టూ... వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వాయు పీడనం వేగంగా తగ్గుతుంది. ఈ ఒత్తిడిలో వల్ల ఆయా ప్రాంతాల్లో వాయువులు, ద్రవాలు త్వరగా విస్తరిస్తాయి. ఇది నరాల మీద తీవ్ర అసౌకర్య ఒత్తిడిని సృష్టిస్తుంది. ఫలితంగా పాత గాయాలు మళ్లీ మేల్కొనడానికి కారణమవుతుంది.
  • ఆర్థోపెడిక్ గాయాలు నాడీ వ్యవస్థలో నాడీ సున్నితత్వం, ఉద్రిక్తతకు దారితీస్తాయి. పెరిగిన సున్నితత్వం వాతావరణ మార్పుల కారణంగా నరాలు వేగంగా స్పందించవచ్చు. దీని ఫలితంగా మునుపటి గాయాల నుండి నొప్పి వస్తుంది.
  • చురుకైన జీవనశైలిని నిర్వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కండరాల బలాన్ని పునరుద్ధరించవచ్చు. శీతాకాలంలో, చాలా మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. అందువలన, శరీరంలో సరైన కదలిక లేకపోవడం కీళ్ళు, కండరాలు గట్టిగా మారడం వంటి పరిస్థితులకు దారి తీస్తుంది. ఇవి పాత గాయాలకు సైతం అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

ఈ పరిస్థితుల నివారణకు.. వెచ్చగా ఉండండి. మీ కీళ్ళు, కండరాలలో దృఢత్వాన్ని నివారించడానికి శారీరక శ్రమలో పాల్గొనండి. నొప్పి నివారణలకు వైద్యున్ని సంప్రదించండి. నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా.. జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం ఆవశ్యకం.