Turkey terror attack: టర్కీలో టెర్రరిస్టు దాడి..ముగ్గురు మృతి

టర్కీలోని అంకారలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి చేశారు.ఈ దాడిలో ముగ్గురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

బుధవారం  (అక్టోబర్ 23) టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్  ఉగ్రవాదులు బాంబు దాడులు చేశారు. పేలుళ్ళలో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారుతున్న సమయంలో దుండగులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. 

ట్యాక్సీలో వచ్చిన టెరర్రిస్టులు ఒక్కసారిగా బాంబులతో విరుచుకుపడినట్టు టర్కీ మంత్రి వెల్లడించారు. ఈ దాడుల్లో ఒక మహిళతో సహా మరో వ్యక్తి పాల్గొన్నట్లు సీసీఫుటేజ్ విజువల్స్ లో కనిపిస్తుంది. కాంప్లెక్స్ లోని సిబ్బందిని బందీలుగా పట్టుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.  

TUSAS ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. టర్కీ రక్షణ పరిశ్రమకు కేంద్రం ఇది. పౌర, సైనిక విమానాలు, మానవరహిత వైమానిక వాహనాలు, అంతరిక్ష వ్యవస్థలను నిర్వహిస్తోంది. దాని కీలక ప్రాజెక్టులలో టర్కీ మొదటి జాతీయ యుద్ధ విమానం KAAN కూడా ఉంది. 

కాన్ లక్ష్యంగా గతంలో కుర్దిష్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలు, వామపక్ష తీవ్రవాదులతో సహా వివిధ మిలిటెంట్ గ్రూపులు  దాడులు చేశాయి. అయితే బుధవారం జరిగిన దాడిపై ఏ మిలిటెంట్ గ్రూప్ బాధ్యత వహించలేదు.