యాదాద్రి ఆలయానికి రూ. 3కోట్ల బిల్డింగ్ విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు: హైదరాబాద్ కు చెందిన శారద, హనుమంతరావు అనే దంపతులు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రెండంతస్తుల ఇంటిని  రాసిచ్చారు. తమ బిల్డింగ్ ను వారు  సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో యాదగిరిగుట్ట దేవస్థానం పేరిట  రిజిస్ట్రేషన్ చేసి.. పత్రాలను ఆలయ ఈవో రామకృష్ణారావుకు  అందజేశారు. 

హైదరాబాద్​లోని చైతన్యపురిలో 260 గజాల స్థలంలో  రెండంతస్తుల బిల్డింగ్ ఉందని, దాని విలువ  దాదాపు  రూ.3 కోట్లు ఉంటుందని శారద,  హనుమంతరావు తెలిపారు. తమ ఇంటిని నారసింహుడికి సమర్పించుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమన్నారు.చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గట్టు శ్రావణ్ కుమార్, సూపరింటెండెంట్ సత్యనారాయణశర్మ, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.

స్వామివారిని దర్శించుకున్న నాగర్​కర్నూల్ కలెక్టర్

 శ్రీలక్ష్మీనరసింహస్వామిని సోమవారం నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గర్భగుడిలో  ప్రత్యేక పూజలు చేశారు.  ఆయనకు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు   వేదాశీర్వచనం చేయగా,  ఆలయ సూపరింటెండెంట్ వాసం వెంకటేశ్​ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.   పూజలు, నిత్యకైంకర్యాల ద్వారా సోమవారం ఆలయానికి రూ.28,18,641 ఆదాయం వచ్చింది.

ALSO READ : డబుల్ ఇండ్ల కోసం ఎంపీడీవో ఆఫీసు ముందు ధర్నా