ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా 2డీ ఎకో మిషన్

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 2డీ ఎకో మిషన్ నిరుపయోగంగా మారింది. గుండె పనితీరును పరీక్షించేందుకు సుమారు రూ.17 లక్షలతో కొనుగోలు చేసిన ఈ మిషన్ ను కార్డియాలజిస్ట్ లేకపోవడంతో నాలుగేళ్లుగా వినియోగించడం లేదు. ఈ మిషన్ పాడవకుండా రోజూ 4 గంటలపాటు చార్జింగ్ పెట్టడం, తిరిగి కవర్ కప్పి పక్కన పెడుతున్నారు. ఇప్పటికైనా కార్డియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించి మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వినియోగంలోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వెలుగు ఫొటో గ్రాఫర్‍, కరీంనగర్