దక్షిణ కొరియాలో విషాదం.. ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. ఫెన్సింగ్ను ఢీ కొట్టిన విమానం.. 28 మంది దుర్మరణం

సియోల్: దక్షిణ కొరియాలో ఆదివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకాక్ నుంచి 175 మంది ప్రయాణికులతో వస్తూ ముయూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై ల్యాండ్ అవుతున్న జెజు ఎయిర్ ఫ్లైట్ 2216  విమానం అదుపు తప్పి ఫెన్సింగ్ను ఢీ కొట్టింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. విమానం మంటల్లో తగలబడిపోయింది. ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. విమానంలో ఉన్న 29 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి లోకల్ టైం ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

ఈ దుర్ఘటన జరిగిన కాసేపటికే విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆల్ మోస్ట్.. ఫ్లైట్ మొత్తం మంటల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ల్యాండింగ్ గేర్ సవ్యంగా పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ముయూన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి.