శ్రీ క్రోధి నామ సంవత్సరం పంచాంగం వచ్చేసింది. 12 రాశుల వారి జాతక ఫలితములు వెల్లడయ్యాయి. నక్షత్ర ఫలితాలు అనేవి ఎంతో విశేషమైనవి. ప్రతి రాశిలో వివిధ రాహులు, నక్షత్రాలు ఉండటం సహజం. అందుకే పండితులు నక్షత్ర ఫలితాలను సైతం వెల్లడించటం జరిగింది. 27 నక్షత్ర ఫలితాలను సూక్షమంగా ఇలా తెలుసుకుందాం..
అశ్వని : ప్రతి విషయంలో నియమ నిబంధనలు కలిగి మాట్లాడగలరు.
భరణి : మాటల వర్ణన ఎక్కువగా ఉంటుంది. కాని తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు పూర్తి చేయండి.
కృత్తిక : వీరు ఎవరికీ అర్థము కారు. ఎక్కడా చిక్కరు, దొరకరు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటారు.
రోహిణి : గ్రహ కలయిక లేక తొందరపాటుగా కనిపించగలరు. నిరంతరం దుర్గా జపం చేయండి.
మృగశిర : అధిక శ్రమకు దగ్గరగా ఉంటారు. పట్టుదలకు కట్టుబడి ఉంటారు.
ఆరుద్ర : చాలా సున్నితమైన మనసు. ఎవరిని నమ్మలేరు. అలాగని వీరిని వీరు నమ్మలేరు.
పునర్వసు : తొందరగా మాట్లాడగలరు. గురుబలం కొరకు నిరంతరం గురు నామం జపించండి.
పుష్యమి : పట్టుదల కలవారు. మాటలు చాలా కటువుగా ఉంటాయి. శని జపం నిరంతరం చేయండి.
ఆశ్లేష : అధికంగా మాట్లాడగలరు. ధన దాహం కలిగి ఉంటారు.
మఖ : తొందరపాటు వద్దు. ఆరోగ్యంపైన శ్రద్ధ ఉంచండి. ఖర్చులకు దూరంగా ఉండండి.
పుబ్బ : ప్రతి విషయంలో పొదుపుగా ఉండండి. తొందరపాటు పనికిరాదు.
ఉత్తర : నిదానంగా ఉంటారు. సూర్య నమస్కారములు మీకు అధిక శక్తిని ఇవ్వగలవు.
హస్త : చాలా తెలివి గలవారు. పొగడ్తలకు పొంగిపోయి నష్టపడగలరు.
చిత్త : పట్టుదల ఉన్నది కాని అనుకూలంగా లేదు. శరవణభవ జపం నిరంతరము చేయండి.
స్వాతి : తక్కువగా మాట్లాడగలరు. వారికి అనుకూలముగా ఉన్నా ఆనందంగా ఉంటారు.
విశాఖ : ప్రతి విషయంలో నిర్లక్ష్యము, తొందర మాటలు తరువాత మానసిక బాధ ఉంటుంది.
అనూరాధ : వీరికి అనుకూలంగా మాటలు వింటారు. ఎవరికీ అర్థం కారు. నిర్లక్ష్యము వదిలితే మంచిది.
జ్యేష్ట : పైకి మాట్లాడినంత మనోనిగ్రహం లేదు. ఏకాగ్రతకు ప్రయత్నం చేయండి.
మూల: తొందరగా ఎవరినీ నమ్మరు. నమ్మితే నష్టపోగలరు. మీపైన మీరు నమ్మకం పెంచుకొనగలరు.
పూర్వాషాఢ : పొగడ్తలకు పొంగరాదు. నిర్మలంగా ఆలోచన చేసి శక్తిని పెంచుకొనగలరు.
ఉత్తరాషాఢ : తొందరగా ఎవరినీ నమ్మలేరు. ముక్కుసూటిగా మాట్లాడగలరు. సూర్య ఆరాధన చేయండి.
శ్రవణం : చాలా నిరంకుశంగా మనసు ఉంటుంది. అందరికీ అనుకూలంగా ఉన్న ఆకస్మిక ధన సంపాదన.
ధనిష్ఠ : చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దర్శనం చేయండి.
శతబిషం : ఎవరికీ అర్థం కారు. మొండిగా ఉంటారు. లలితా దేవి ఆరాధన చేయండి.
పూర్వాభాద్ర : ఎవరికీ అర్థం కారు. గట్టిగా మాట్లాడగలరు. గురు స్తుతి నిరంతరం చేయండి.
ఉత్తరాభాద్ర : ప్రతి విషయంలో మందముగా, స్లోగా కనిపిస్తారు. శనికి తైలాభిషేకం చేయాలి.
రేవతి : వెంకటేశ్వర స్వామి అలంకరణ, గోవింద నామాలు చదివితే అనుకోని లాభాలు.