Gen Beta: 2025తోపాటు న్యూ ఎరాకు వెల్కమ్.. ‘జనరేషన్ బీటా’ గురించి కొన్ని విషయాలు

2025 ప్రారంభం..కొత్త జనరేషన్ బీటా యుగానికి కూడా నాంది పలుకుతుంది.ఈ యుగంలో రాబోయే 15 యేళ్లలో జన్మించే కొత్త జనరేషన్​ పిల్లల గురించి చెబుతోంది. 2025 నుంచి 2039 మధ్య జన్మించిన పిల్లలను వివరించడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ట్​ గా డెవలప్​ అవుతున్న టెక్నాలజీతో అనుబంధం,లోతైన సామాజిక మార్పులు గురించి వివరిస్తుంది. 

జనరేషన్​రిసెర్చర్స్​ (తరాల పరిశోధకులు) ఇప్పటివరకు మూడు రకాల జనరేషన్లు విభజించారు. అంటే 1981 నుంచి ఇప్పటివరకు పుట్టినవారిని మిలీనియల్స్​(1981–1996), Gen Z(1996-2010), Gen Alpha(2010-2024)  అని మూడు జనరేషన్లలో చూపించారు. ఇక 2025నుంచి 2039 వరకు పుట్టే పిల్లలను నాలుగో జనరేషన్​బీటా యుగానికి చెందిన వారికిగా వర్ణిస్తున్నారు. 

జనరేషన్​ పరిశోధకుడు, రచయిత జాసన్​ డోర్సే జనరేషన్​ బీటా గురించి చెబుతూ..ఈతరం పిల్లలు, పాత జరేషన్​ పిల్లలకు మధ్య తేడాను వివరించారు. మిలీనియల్స్​, జెన్ జెర్స్​, జనరల్​ఆల్ఫ వారికంటే భిన్నంగా వారి జీవితాలను ప్రారంభిస్తారని చెబుతున్నారు.  

జనరేషన్​ బీటా ..కొత్త తరం గురించి కొన్ని విషయాలు.. 

జనరేషన్​ బీటా ..ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్, స్మార్ట్​ డివైజ్ లు లేకుండా వీరి జీవితం లేదు. AI, స్మార్ట్​ ఫోన్లు లేకుండా  రోజులో ఒక్క క్షణం కూడా గడవదని అంటున్నారు. 

సోషల్​ మీడియా అనేది ఇప్పుడున్న జనరేషన్లకు సూచిక అయితే..జనరేషన్​ బీటా లో ఇంకా బాగా డెవలప్​ చేయబడుతుందంటున్నారు..ఒకరకంగా చెప్పాలంటే.. ఈజనరేషన్​ లో పుట్టినవారు సోషల్​ మీడియాలో పూర్తిగా మునిగి తేలుతారని చెబుతున్నారు. 

అంతేకాదు..అనేక సమాజిక సవాళ్లతో పోరాడే ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని చెబుతున్నారు.పర్యావరణ సవాళ్లు సామాజిక విలువపై ప్రభావం చూపుతా యని అంటున్నారు. 

మిలీనియల్స్​, జెన్​ ఆల్ఫా, జెన్​ జెర్స్​ వారి పిల్లలు ఈ జనరేషన్​ లో ఉంటారు.. వీరంతా 22వ శతాబ్దంలో జీవిస్తారని ప్రముఖ జనరేషన్​రీసెర్చర్ డోర్సే చెబుతున్నారు.