కొత్త ఏడాది.. 2024లో ఏయే రాశుల వారికి బాగుంటుంది..?

 2024 వ సంవత్సరంలో జ్యోతిష్య నిపుణుల వివరాల ప్రకారం   గ్రహాలు, నక్షత్రాల కలయిక శుభప్రదంగా ఉంది. ఈ పరిస్థితి రాబోయే చాలా నెలలు కొనసాగుతుంది. ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.  మీ రాశి ఫలం ఆధారంగా మీకు ఆ ఆదృష్టం ఉందో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే 2024 కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. . 

మేషరాశి 

కొత్త(2024) సంవత్సరంలో  మేషరాశివారికి నూతన  గృహ యోగం వంటి యోగములు  అవకాశములు అధికముగా ఉన్నాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ...  నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి .. ధనలాభము కలుగును. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలె తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

వృషభం

ఈ సంవత్సరం అదృష్ట రాశుల్లో వృషభం ఒకటి. 2024 మే చివరి వరకు సమృద్ధి, విలాసాలతో నిండి ఉంటుంది. సంవత్సరం పొడవునా అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ ఆశలు, కలలను జయించటానికి సిద్ధంగా ఉండండి. మీరు వాటికి చేరుకునేందుకు దగ్గర్లో ఉన్నారు. ఆర్ధిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సంతానం విషయంలో కొంత జాగ్రత్త వహించండి. 

మిధున రాశి

ఈ  రాశి వారు కొత్త సంవత్సరంలో చాలా ఉత్సాహంగాఉంటారు. మిథున రాశి వారికి ఈ సమయం వరంలాంటిది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. జులై నుంచి సెప్టెంబర్ వరకు శుక్రుడు తిరోగమనంలో ఉంటాడు. దాని వల్ల ఆగస్టులో రొమాంటిక్ లైఫ్ సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది.  

కర్కాటక రాశి 

 ఈ రాశి వారికి 2024 జాన్​తరువాత వృత్తి, వ్యాపారంలో మార్పులు సంభవిస్తాయి.  ప్రమోషన్లు రావడం... గుర్తింపు పొందడంతో మీరు చాలా ఆనందంగా జీవితం గడుపుతారు.  బాధ్యతలు పెరగడంతో సహోద్యోగుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.  విదేశీ చదువులకు అనుకూలమైన కాలం.  ఆర్ధిక పరంగా లాభదాయకంగా ఉంటుంది.  కొన్ని రోజుల తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. ఇతరులతో మీ సంబంధాలు ప్రభావితం కానున్నాయి. ఫిబ్రవరి, మార్చి, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో కొన్ని రోజులు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆగస్టులో భార్యభర్తలు  సర్దుకుని ఉంటూ జీవితాన్ని ముందుకు సాగించాలి.

సింహరాశి

ఈ రాశి వారు 2024లో దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.  మీరు చేసే వృత్తి వ్యాపారంలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.  మీ తెలివితేటలను ఉపయోగించి  ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు.  ఎక్కువుగా శారీరక శ్రమ పడే అవకాశం ఉన్నందున  ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి.  విద్యార్థుల కెరీర్​ కు సంబంధించి పురోగతిని సాధిస్తారు. 

కన్య రాశి

ఈ రాశివారికి 2024 వ సంవత్పరంలో  శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం విద్యార్థులకు వరం కంటే తక్కువ కాదు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కాని ప్రేమ జీవితం కొంచెం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మార్చి నుంచి మే వరకు సంతోషకరమైన జీవితం గడుపుతారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కాస్త ఇబ్బందులు ఉంటాయి. అక్టోబర్ లో వివాహానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది.  

తులారాశి

2024 వ సంవత్సరంలో తులరాశి వారు శుభవార్తలు వింటారు. మీకు విదేశాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు కారు లేదా ల్యాండ్ లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ లవ్ సక్సెస్ అవుతోంది. 

వృశ్చిక రాశి

2024 మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీరు కెరీర్‌లో ఎవరూ ఊహించని స్థాయికి వెళతారు. వ్యాపారవేత్తలు కొత్త సంవత్సరం భారీగా లాభాలను ఇస్తుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. 2023లో వచ్చిన కష్టాలు రాబోయే సంవత్సరంలో తొలగిపోతాయి. 

ధనుస్సు రాశి

ఈ రాశి వారు 2024 వ సంవత్పరంలో  శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు. 

మకర రాశి

ఈ రాశి వారికి 2024లో మంచి అవకాశాలు వస్తాయి.  వృత్తి, వ్యాపారంలో అనుకున్న విజయాలకు దగ్గరగా ఉంటారు.  ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ప్రేమ వ్యవహారంలో కొన్ని చిక్కులు తప్పవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

కుంభ రాశి

కుంభ రాశి వారికి 2024 వ సంవత్సరంలో చాలా మేలు కలుగుతుంది.  ఫిబ్రవరి 14, 2024 మీ జీవితంలో ఒక ప్రాముఖ్యతను సూచిస్తుంది. సమాజంపై మీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో ప్రమోషన్లు ఉంటాయి.  అయితే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు. నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది.   ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. 

మీన రాశి

సంవత్సరం ప్రారంభం మీ కెరీర్‌కు చాలా లాభదాయకంగా ఉంటుంది.  మీ కెరీర్‌ను కొత్త శిఖరాలకు నడిపిస్తుంది. మీరు మీ లక్ష్యాల పట్ల విపరీతమైన అంకితభావం మరియు మనస్సాక్షితో మీ పని చేస్తారు.  మీరు మీ పనిని పూర్తి నిజాయితీతో నిర్వహిస్తారు. జనవరి నుండి మార్చి వరకు సంవత్సరం ప్రారంభంలో మీరు భారీ ఉద్యోగాన్ని పొందవచ్చు.  మీరు పనిపై ఆధిపత్యం చెలాయిస్తారు.    ఉన్నతాధికారులు మీ పట్ల సంతృప్తిగా కనిపిస్తారు.