కొత్త సంవత్సరం వేడుకలు.. ఇలా చేస్తే అదిరిపోద్ది..

2024  కొత్త సంవత్సరానికి  కౌంట్​ డౌన్​ ప్రారంభమైంది.   ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తారు.చాలామంది తమ కుటుంబం, బంధువులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని కోరుకుంటారు. ఇలాంటి వారు కొన్ని ప్రత్యేక ఆలోచన విధానాలతో ఇలా ట్రై చేస్తే హ్యాపీగా గడిపేయచ్చు.

డిన్నర్ ప్లాన్

ఆహారం, పానీయాలు లేకుండా కొత్త సంవత్సరాన్ని జరుపుకోలేము. కుటుంబ సభ్యులందరితో కలిసి డిన్నర్ ప్లాన్ చేస్తే బాగుటుంది. కుటుంబంతో కలిసి అద్భుతమైన విందు చేస్తే అది తప్పకుండా గుర్తిండిపోతుంది.

ఇండోర్ గేమ్స్

ఇండోర్ గేమ్ లతో కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి జరుపుకుంటే బాగుంటుంది. ఆటలతో పాటు కొన్ని స్నాక్స్ కూడా ఉంచుకోవచ్చు. గేమ్ ఆడుతూ స్నాక్ తింటూ ఉండొచ్చు

థీమ్ పార్టీ

థీమ్ పార్టీ ఆలోచన ఉత్తమంగా ఉంటుంది. ఇంట్లో పార్టీ చేసుకుంటూ వేరే ఏదైనా చేయాలనుకుంటే సెల్ఫీ కార్నర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక గోడను ఎంచుకొని దానిపై పెద్ద ఫ్రైమ్ ను ఉంచండి దానిలో సెల్ఫీ స్టిక్, రంగురంగుల అమరిస్తే మీ బంధువుల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది.ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకొనే వారికి థీమ్ పార్టీ ఆలోచన ఉత్తమంగా ఉంటుంది. థీమ్ ప్రకారం ఇంటిని అలంకరించవచ్చు. ఆ థీమ్ ప్రకారం కుటుంబ సభ్యులందరినీ దుస్తులు ధరించమని అడగవచ్చు. ఈ పార్టీకి డీజే ని యాడ్ చేస్తే న్యూఇయర్ అదిరిపోవాల్సిందే.

భోగి మంటలు

నూతన సంవత్సరం రోజున విపరీతమైన చలి ఉంటుంది. కావున భోగి మంటలను ప్లాన్ చేసుకోవచ్చు.