స్థానిక ఎమ్మెల్సీ..కౌంటింగ్‌‌‌‌ ఇయ్యాల్నే

  •    మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ బాయ్స్‌‌‌‌ జూనియర్‌‌‌‌ కాలేజీలో లెక్కింపు
  •     ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
  •     మొత్తం 8 టేబుళ్లపై కౌంటింగ్‌‌‌‌
  •     మధ్యాహ్నం వరకు రిజల్ట్‌‌‌‌ వచ్చే ఛాన్స్‌‌‌‌

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎమ్మెల్సీ బై పోల్‌‌‌‌ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. మార్చి 28న ఎలక్షన్‌‌‌‌ జరుగగా షెడ్యూల్‌‌‌‌ ప్రకారం ఏప్రిల్‌‌‌‌ 2నే ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి ఉంది. కానీ పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆలోచనలో కౌంటింగ్‌‌‌‌ను జూన్‌‌‌‌ 2కు వాయిదా వేశారు. దీంతో ఆదివారం ఓట్లను లెక్కించేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ముగ్గురు క్యాండిడేట్లు.. 1,437 మంది ఓటర్లు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్ధానానికి నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చిన ఈసీ మార్చి 28న ఉప ఎన్నిక నిర్వహించింది. కాంగ్రెస్‌‌‌‌ తరఫున వ్యాపారవేత్త మన్నె జీవన్‌‌‌‌రెడ్డి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జడ్పీ మాజీ వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ నవీన్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి, ఇండిపెండెంట్‌‌‌‌గా సుదర్శన్‌‌‌‌ గౌడ్‌‌‌‌ పోటీ చేశారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,439 మంది స్థానిక ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఒకరు, విదేశాల్లో ఉండడంతో మరొకరు ఓటు వేయలేదు. 

ఎనిమిది టేబుళ్లపై లెక్కింపు, మధ్యాహ్నం వరకు రిజల్ట్‌‌‌‌

స్థానిక ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని బాయ్స్‌‌‌‌ జూనియర్‌‌‌‌ కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎనిమిది టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీ ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో ఏ క్యాండిడేట్‌‌‌‌కు కూడా గెలుపు కోసం అవసరమైన ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు రిజల్ట్స్​వచ్చే అవకాశంఉంది.

కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మధ్య పోటాపోటీ

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ స్థానిక ఉప ఎన్నికను కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముగ్గురు క్యాండిడేట్లు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్యే నడిచింది. ఎలాగైనా విజయం సాధించేందుకు క్యాండిడేట్లు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. తమకు అనుకూలంగా ఉన్న స్థానిక ఓటర్లను క్యాంప్‌‌‌‌లకు తరలించారు. గోవా, ఊటి, కొడైకెనాల్, నెల్లూరు, కర్నాటక వంటి ప్రాంతాల్లో క్యాంప్‌‌‌‌లు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించారు.

పోలింగ్‌‌‌‌ రోజున క్యాంప్‌‌‌‌ల నుంచి డైరెక్ట్‌‌‌‌గా పోలింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌కు తీసుకొచ్చారు. అన్ని ఖర్చులు కలుపుకొని ఒక్కో క్యాండిడేట్‌‌‌‌ రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది.      

లోకల్‌‌‌‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లు

పోలింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌     పురుషులు    మహిళలు    మొత్తం

మహబూబ్‌‌‌‌నగర్             117                  128                245
కొడంగల్                          27                     29                 56
షాద్‌‌‌‌నగర్                         77                     94                171
నారాయణపేట               89                   115                 204
వనపర్తి                             99                   119                 218
గద్వాల                             91                  134                 225
కొల్లాపూర్                         28                     39                   67
నాగర్‌‌‌‌కర్నూల్                 48                     52                 100
అచ్చంపేట                     37                    42                    79
కల్వకుర్తి                          31                    41                     72

మొత్తం                            644                  793                 1,437