వరంగల్ జిల్లాలో సంబరంగా ఎంగిలి పూల బతుకమ్మ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.  తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. ఎంగిల పూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభమై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.  హనుమకొండలోని వేయి స్తంభాల గుడి వద్ద మహిళలు బతుకమ్మలతో వచ్చి ఒక చోట చేరారు. 

సంప్రదాయబద్ధంగా ముస్తాబై ఒక్కేసి పువ్వేసి చందమామా అంటూ పాటలు పాడి పండగ చేసుకున్నారు. తొర్రూర్, మహబూబాబాద్, హాసన్ పర్తి, హనుమకొండ తదితర ప్రాంతాల్లో  ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు.      - వెలుగు,  వరంగల్