నల్లగొండ జిల్లాలో బతుకమ్మ సంబురాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి. తొలిరోజు బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ సంబురంగా జరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం, వీటి కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆర్టీసీ కాలనీ శ్రీకృష్ణ టెంపుల్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడారు. 

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల్లోనూ ఎంగిలిపూట బతుకమ్మ ఆటలు సంబురంగా జరిగాయి. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన ఎంగిలి పూల బతుకమ్మ పండుగను మహిళలు వైభవోపేతంగా జరుపుకున్నారు. ‌‌‌‌ 

 

 

 

​​​​​​​

- ఫొటోగ్రాఫర్, నల్గొండ/సూర్యాపేట/యాదగిరిగుట్ట, వెలుగు