ఆదిలాబాద్​ జిల్లాలో సంబురంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ సంబరాలు షురూ అయ్యాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను గ్రామాలు, పట్టణాల్లో మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చి కోలాటాలు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. బతుకమ్మకు నువ్వుల నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 

ఆదిలాబాద్​పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిర్వహించిన వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి పాల్గొన్నారు. స్టూడెంట్లతో కలిసి బతుకమ్మ పాటలకు కొలాటాలు ఆడుతూ సందడి చేశారు. మంచిర్యాల జిల్లాతో వేడుకలు జోరుగా ప్రారంభమయ్యాయి.      - నెట్​వర్క్, వెలుగు