హైదరాబాద్‌లో బతుకమ్మ సంబురాలు

  • ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..ఏమేమి కాయొప్పునే..

సిటీలో బతుకమ్మ సంబురాలు బుధవారం ఘనంగా మొదలయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు అంతా ఒక్కచోట చేరి ఆడిపాడారు.  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. పీపుల్స్​ప్లాజాలోని సరస్​ఫెయిర్​లో నిర్వహించిన సంబురాల్లో మంత్రి సీతక్క

వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని బతుకమ్మ ఆడారు. కూకట్​పల్లి, ఎల్బీనగర్, ​కొత్తపేట, కృష్ణానగర్, మాన్సూరాబాద్, ఉప్పల్, ఇబ్రహీపట్నంతోపాటు వేర్వేరుచోట్ల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. – సిటీ నెట్​వర్క్, వెలుగు 

  • Beta
Beta feature
  • Beta
Beta feature