ఫాజుల్ నగర్, హన్మాజిపేట నుంచి .. కాంగ్రెస్​ లోకి 200 మంది చేరిక

వేములవాడరూరల్​, వెలుగు : కాంగ్రెస్​  అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు ఆకర్షితులవుతున్నారని ప్రభుత్వ విప్​, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ అన్నారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్, హన్మాజిపేట నుంచి దాదాపు 200 మంది కాంగ్రెస్ చేరారు. బీఆర్​ఎస్​, బీజేపీతో పాటు ముదిరాజ్, రజక, కురుమ, రెడ్డి సంఘ సభ్యులు పార్టీలో చేరగా.. కండువా కప్పి ఆహ్వానించారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలోనే ఫాజుల్ నగర్ ప్రాజెక్టు పూర్తయిందని, నేడు కూడా కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్​, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్​ గౌడ్​, సంగ స్వామి, సోయినేని కరుణాకర్​ తదితరులు పాల్గొన్నారు. 

చందుర్తి: దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.   మండల కేంద్రంలోని రైతు వేదికలో దివ్యాంగులకు సహాయ పరికరాలు గురువారం అందించారు. జిల్లావ్యాప్తంగా 23న కంటిచూపు శిబిరం, 28 ఆర్థోపెటిక్ శిబిరాలను నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో   1,19,600 పింఛన్లు అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం   ప్రాథమిక పాఠశాలలో ‘స్వచ్ఛదనం... పచ్చదనం’ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీఓ సౌందర్య, అడిషనల్ సీడీపీఓ సుచరిత  పాల్గొన్నారు.