నల్గొండలో ప్రైవేట్‌ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

నల్గొండ సమీపంలోని మర్రిగూడ బైపాస్ దగ్గర ఆదివారం(అక్టోబర్ 06) తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తాపడిన ఘటనలో.. పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు. బైపాస్ దగ్గర ప్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో.. రోడ్డుపై బారీకేడ్లు పెట్టారు. బారీకేడ్లను తప్పించే క్రమంలో ప్రైవేట్ బస్సుబోల్తా కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.