ట్రంప్ వలస ప్రతిజ్ఞ.. రిస్క్లో 18వేల మంది ఇండియన్స్?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక అక్కడి భారతీయులను చిక్కుల్లో పెట్టనుందా.. తాను గెలిస్తే వలసదారులను వెనక్కి పంపిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రతిజ్ణ చేసిన ట్రంప్.. అధికారం చేపట్టిన వెంటనే ఆ  పనిచేస్తారా? 2025 జనవరి 20 తర్వాత అమెరికాల వలసదారుల పరిస్థితి ఏంటీ?

అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ లెక్కల ప్రకారం..అమెరికాలో  మొత్తం 1.45 మిలియన్లు వలసదారులున్నారు. వీరితో 18వేల ఇండియన్స్ కూడా ఉన్నారు. గడిచిన మూడేళ్లలో 90వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా ప్రవేశించి పట్టుబట్టారు.వీరిలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందినవారే. చాలా మంది సరియైన డాక్యుమెంట్లు  లేకపోవడం, చట్టబద్ధమైన ప్రయాణం వంటి విషయాల్లో అనేక సవాళ్లు ఎదుర్కుంటున్నారు.

అయితే వలసదారుల్లో ఎక్కువ మంది ఇండియన్స్ కాదు. అమెరికా సరిహద్దు దేశమైన హోండారాస్ నుంచి 2లక్షల 61వేల మంది, గ్వాటెమాల దేశాలనుం 2లక్షల 53వేల మంది అత్యధిక వలసదారులగా ఉన్నారు. ఇక ఆసియలో దేశాల నుంచి  చూస్తే.. చైనా నుంచి 37వేల 908మంది ఉండగా.. ఇండియా 17వేల 940 మంది వలసదారులతో 13 స్థానంలో ఉంది. 

అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ చేపడతామని ట్రంప్ ప్రతిజ్ఞ చేసిన క్రమంలో బహిష్కరణకు సంబంధించిన తుది ఉత్తర్వులతో వేలాది మంది ఇండియన్స్ తిరిగి భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. 

బార్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ పాలసీలకు సహకరించని దేశాల్లో భూటాన్, క్యూబా, ఇరాన్, పాకిస్థాన్, రష్యా , వెనిజులాతో పాటు భారత్ ను కూడా చేర్చారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్య పరమైన సంబంధాలలో మరింత సవాల్ గా మారే అవకాశం ఉంది.