ఈ యాప్‌లు ఇన్‌స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం

అశ్లీల కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ యువతను ఆకర్షిస్తోన్న ఓటీటీ యాప్‌లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న 18 OTT యాప్‌లపై ఈ ఏడాది నిషేధం విధించింది. ఈ యాప్‌లలో ఉన్న కంటెంట్ వాటికేం తక్కువ కాదు.. అంత అసభ్యకరంగా ఉన్నాయి. అందునా, 18 ఏళ్లలోపు ఉన్న వారు ఈ యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతి లేదన్న నిబంధనలూ పాటించలేదు. యథేచ్ఛగా ఇష్టమొచ్చినట్లు అర్ధనగ్న వీడియోలు చిత్రీకరించి వాటిని అప్‌లోడ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో హానికరమైన కంటెంట్‌ను అరికట్టడంలో భాగంగా సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంది. 

ALSO READ | OTT సబ్‍స్క్రిప్షన్ అడుక్కునే వారికి భారీ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్ బాటలో అమెజాన్ ప్రైమ్

నిషేధించబడిన ఓటీటీ యాప్‌లు IT చట్టంలోని సెక్షన్‌లు 67, 67Aలను పదే పదే ఉల్లంఘిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ కనుగొంది. వీరు తమ అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేసుకోవడానికి Facebook, WhatsApp, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నారు. సదరు యాప్‌లను నిషేధించడంతోపాటు  IPCలోని సెక్షన్ 292 కింద కేసులు నమోదు చేసింది. నిషేధింపడిన యాప్‌లలో కొన్ని బాగా పాపులర్ అయినవి ఉన్నాయి. ఒక్కో యాప్‌కు కోటికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్న వారున్నారు.

నిషేధించబడిన 18 యాప్‌లు ఇవే.. 

  • Dreams Films
  • Voovi
  • Yessma
  • Uncut Adda
  • Tri Flicks
  • X Prime
  • Neon X VIP
  • Besharams
  • Hunters
  • Rabbit
  • Xtramood
  • Nuefliks
  • MoodX
  • Mojflix
  • Hot Shots VIP
  • Fugi
  • Chikooflix
  • Prime Play