హైదరాబాద్​లో 18లక్షలు కాలం చెల్లిన బండ్లు

  • 15 ఏండ్లు దాటి ఫిట్​నెస్లేకపోయినారోడ్లపైకి
  • సెంటిమెంట్, ఇతర కారణాలతో స్ర్కాప్ చేయని మరికొందరు
  • కేంద్రం తెచ్చిన స్ర్కాప్ పాలసీ అమలుకు ఆర్టీఏ అధికారుల కసరత్తు
  • పాత బండ్లను స్ర్కాప్ చేసేందుకు ముందుకొచ్చేటోళ్లకు రాయితీలు
  • శంషాబాద్ దగ్గర్లో స్ర్కాపింగ్ ప్లాంట్.. జనవరి 1 నుంచి పాలసీ అమలు! 

దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్క్రాపింగ్​పాలసీలో భాగంగా వాటిని స్క్రాప్​చేసేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం నగర శివార్లలో ఒక స్ర్కాపింగ్​ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

రోజురోజుకు పెరుగుతున్నయ్..   

గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో మొత్తం 80 లక్షల వాహనాలు ఉండగా, వీటిలో 15 ఏండ్లు దాటిన వాహనాలు దాదాపు 18 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతున్నదని చెబుతున్నారు. అందుకే పర్యావరణ హిత వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ‘‘పాత బండ్లను స్ర్కాప్​చేసేందుకు వాహనదారులు ముందుకురాకపోవడంతోనే నగరంలో కాలం చెల్లిన బండ్ల సంఖ్య పెరుగుతున్నది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్ర్కాప్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించాం. వాహనాదారులు ముందుకొచ్చి స్ర్కాప్​పాలసీ అమలుకు సహకరించాలి” అని అధికారులు కోరుతున్నారు. తద్వారా గ్రేటర్​లో వాయు కాలుష్యం తగ్గుతుందని చెబుతున్నారు. 

శంషాబాద్ దగ్గర్లో ప్లాంట్..  

గ్రేటర్ లో స్ర్కాప్​పాలసీని కచ్చితంగా అమలు చేసేందుకు ఆర్టీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో స్ర్కాపింగ్​ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ​ప్లాంట్​ఏర్పాటుకు రెండు మూడు కంపెనీలు ముందుకురావడంతో.. అధికారులు కూడా ప్లాంట్​ఏర్పాటుపై దృష్టి పెట్టారు. శంషాబాద్​లోని నందిగామ, వర్గల్, తూప్రాన్​ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ మూడింటిలో ఒకచోట ప్లాంట్​ఏర్పాటు చేస్తామని హైదరాబాద్​ఆర్టీఏ జాయింట్​కమిషనర్ రమేశ్​కుమార్​ తెలిపారు. అన్ని అనుకూలిస్తే వచ్చే జనవరి 1 నుంచే స్క్రాప్​పాలసీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాలసీ కింద స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాహనదారులకు కొన్ని రాయితీలు అందనున్నాయి. వెహికల్ ను స్ర్కాప్​చేసిన తర్వాత అదే కేటగిరీలో కొత్త వెహికల్ కొనేటప్పుడు డిస్పోజల్ ఆఫ్​స్ర్కాప్​సర్టిఫికెట్​చూపిస్తే రాయితీలు ఇస్తారు. టూవీలర్స్ విభాగంలో రూ.లక్ష విలువైన వాహనాలకు రూ.వెయ్యి, రూ.2 లక్షల వాటికి రూ.2 వేలు, రూ.3 లక్షల వాటికి రూ.3 వేలు రాయితీ ఇవ్వనున్నారు. ఇక ఫోర్ వీలర్ విభాగంలో రూ.5 లక్షల వరకు రూ.10 వేలు, రూ.10 లక్షల వరకు రూ.20 వేలు, రూ.20 లక్షలు ఆపైన విలువ చేసే వాహనాలపై రూ. 50 వేల వరకు రాయితీ ఇవ్వనున్నారు. 

ఆసక్తి చూపని వాహనదారులు.. 

గ్రేటర్​పరిధిలోకి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాలు వస్తాయి. ఈ మూడు జిల్లాల్లో 15 ఏండ్లు దాటిన వాహనాలను స్ర్కాప్ గా మార్చాలని అధికారులు భావిస్తున్నారు. వాహనాదారులు ముందుకొచ్చేలా వారికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గ్రేటర్ లో వాయు కాలుష్యానికి కాలం చెల్లిన వాహనాలే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో 15 ఏండ్లు పైబడిన వాహనాలకు ఫిట్ నెస్ టెస్టు చేసి అందులో పాస్ అయితే.. అలాంటి వాహనాలకు గ్రీన్​ట్యాక్స్​వసూలు చేసి, మరో ఐదేండ్లు రోడ్లపై నడిపించుకునే వెలుసుబాటు కల్పిస్తున్నారు. అయితే ఈ గడువు పూర్తయినవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాలం చెల్లిన వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ చేయాల్సి ఉన్నా, దీనిపై వాహనదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.