బాల్కొండ మండలంలో..కుక్కలు దాడిలో 18 మేకపిల్లల మృత్యువాత

బాల్కొండ, వెలుగు : బాల్కొండ మండల కేంద్రంలోని సిరికంటి శ్రీకాంత్ కు చెందిన మేకపిల్లలు మంగళవారం కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. యాదవ సంఘం వద్ద అతడి ఇంటి ముందున్న మేకల కొట్టం వైపు కుక్కలు ఎగబడడాన్ని గమనించిన స్థానికుల కేకలు వేశారు.

కొట్టంలోకి చొరబడిన కుక్కలో మేక పిల్లల మందపై విరుచుకుపడి చీల్చాయి. దాడిలో 18 మేకపిల్లలు చనిపోయినట్లు శ్రీకాంత్ తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.