జంక్ ఫుడ్ ఎంత పనిచేసింది..మహిళ గాల్బ్లాడర్లో 1500 రాళ్లు

జంక్ ఫుడ్..పిల్లల నుంచి పెద్దల దాక అందరూ ఇష్టంగా తింటుంటారు. ఇంట్లో వంట చేయకపోయినా..సరదాగా అలా బయటికి వెళ్లినా..ఉద్యోగరీత్యా టైం దొరక్కపోవడంతో  డైలీ తీసుకుని భోజనా నికి బదులుగా జంక్ ఫుడ్స్ ను తింటుంటారు చాలామంది.. ఇక పిల్లల విషయానికొస్తే చెప్పనక్కర్లేదు..ఫాస్ట్ ఫుడ్, తియ్యటి కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు,  న్యూడిల్స్ ఇలా అనేక రకాల ఫాస్ట్ ఫుడ్ కి బాగా కనెక్ట్ పోతున్నారు.. అయితే జంక్ ఫుడ్స్ తినడం వల్ల పెద్ద ప్రమాదమే ఉందంటున్నారు డాక్టర్లు.. ఢిల్లీకి చెందిన  ఓ మహిళ గాల్ బ్లాడర్ లో 1500 రాళ్లు తొలగించిన  డాకర్లు.. జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. 

32 ఏళ్ల ఐటీ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గాల్ బ్లాడర్ నుంచి 1500 రాళ్లు తొలగించారు ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ డాక్టర్లు. వైద్య చరిత్రలో ఇది అరుదైన సంఘటన. ఢిల్లీలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఆ మహిళకు జంక్ , కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని ఎక్కువగా తినే అలవాటుందట. గత కొన్ని రోజులు ఆమె కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించేదట.. దీంతో డాక్టర్లను సంప్రదించడంతో టెస్టులు చేసిన డాక్టర్లు షాక్ తిన్నారు. మహిళ కడుపులో గాల్ బ్లాడర్ లో 1500  రాళ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఆపరేషన్ చేసి తీసేశారు. 

సర్ గంగారామ్ హాస్పిటల్లో లాపరోస్కోపిక్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మనీష్ కే గుప్తాతో నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఈ రేర్ ఆపరేషన్ చేశారు. మారుతున్న లైఫ్ స్టైల్, రెండు భోజనాల మధ్య ఎక్కువ సమయం, దీర్ఘ ఉపవాసం ఇలాంటి ప్రమాదానికి దారితీస్తుందని మనీష్ అంటున్నారు. ఈ రాళ్లను తొలగించకుండా ఉంటే పిత్తాశయం క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉందంటున్నారు. దేశంలో ఇలాంటి కేసులు క్రమం పెరుగుతున్నాయన్నారు.