భీమేశ్వర ఆలయానికి రూ.15 లక్షలు మంజూరు

తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండలం లోని భీమేశ్వర ఆలయ అభివృద్ధికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ 15 లక్షల నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ లీడర్లు తెలిపారు. ఈ నిధులతో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మదన్ మాట ఇచ్చిన 15 రోజుల్లోనే నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. లీడర్లు సుగుణకార్ రెడ్డి, షౌకత్, శ్యామ్ రావు, బాల కిషన్ రావు, శ్రీకాంత్, ప్రవీణ్, భాస్కర్, సత్య నారాయణ పాల్గొన్నారు.