ఎల్లారెడ్డిపేట : పిచ్చికుక్కల దాడిలో 14 మందికి గాయాలు

ఎల్లారెడ్డిపేట, వెలుగు: పిచ్చికుక్క దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం నెత్తేట్ల వజ్రవ్వ(56).. నెత్తేట్ల మహాన్వీ (3), నెత్తేట్ల విఘ్నేష్(11) ఆరుబయట ఉన్నారు. అటుగా వచ్చిన ఓ పిచ్చి కుక్క ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. ముగ్గురికి  తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట పీహెచ్‌‌‌‌సీకి  తరలించారు. 

నారాయణపురం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. ఎల్లారెడ్డిపేటలో జరుగుతున్న జాతరలో  9 మంది భక్తులను కుక్కలు కరిచాయి. గాయపడిన వారిని ఎల్లారెడ్డిపేట పీహెచ్‌‌‌‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం  సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.