కరీంనగర్లో రూ.14కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ సిటీలోని అంబేద్కర్ స్టేడియంలో రూ.14కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. మంగళవారం కాంప్లెక్స్‌‌‌‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్​ మాట్లాడుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 22 షెట్టర్లు, 22 రూమ్స్​తో పాటు వెయ్యిమంది కెపాసిటీ గల బ్యాంకెట్ హాల్ నిర్మిస్తున్నామన్నారు. 

పనులను పూర్తిచేసి డిసెంబర్ 31లోపు స్పోర్ట్స్ కాంప్లెక్స్​ను  ప్రారంభిస్తున్నామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు స్టేడియంలో  అన్ని రకాల వసతి, సౌకర్యాలు కల్పించామన్నారు. బీఆర్ఎస్ లీడర్ ఎడ్ల అశోక్, మున్సిపల్​ఆఫీసర్లు  పాల్గొన్నారు.