క్రీ. శ. 1591.. 'చెంచలం' అనే పేట వద్ద గోల్కొండ రాజు మహ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మాణానికి పూనుకున్నాడు. నీటిలోని చేపల వలె ఈ నగరంలోని ప్రజలు కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని అప్పుడాయన దేవుడిని వేడుకున్నాడు. ఆయన ఆశ నెరవేరి నగరం విస్తరించింది. ఆయన ప్రార్థన ఫలించింది. కోటి మందిని కడుపులో దాచుకున్న నగరం హైదరాబాద్, హైదరాబాద్ అంటే ఐటీ, రాజకీయాలు, కొలువులు చదువులే కాదు, రోజూ వార్తల్లో వినిపించని ఎన్నోవిశేషాలుంటాయి.
నాలుగు వందల ఏళ్ల చరిత్రలో ప్రపంచ దేశాల నుంచి ఎన్నో జాతుల వాళ్లు బతకడానికొచ్చారు. అన్ని మతాలను అక్కున చేర్చుకుని చరిత్రలో సమతకు పెట్టినిల్లుగా నిలిచింది. వేర్వేరు వేషభాషల ప్రజలందరినీ ఒక్కటి చేసిన చరిత్ర పేరు హైదరాబాద్, చరిత్రకారుడు ట్రావెర్నియర్తో 'భాగ్నగర్' అని ప్రశంసలందుకున్న ఉద్యాన వనాల నగరం ఇప్పుడు ఉద్యోగాల నగరమయింది. గోల్కొండ వజ్రాలు, ముత్యాల మార్కెట్లతో మొదలైన హైదరాబాద్ వైభవం నేటి ఐటీ అభివృద్ధితో ముందడుగిస్తూనే ఉంది.
1: ఉజ్జయినీ మహంకాళి ఆలయం
సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో శ్రీ ఉజ్జయినిమహంకాళి ఆలయం ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ళ నాటిది. ఈ గుడిలో శక్తికి,అధికారానికి దేవత అయిన మహంకాళి మాత జరిగే జాతరప్పుడు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
2 : ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్
ఉన్నత విద్యాభివృద్ధి కోసం వందేళ్ల క్రితం ఏడో నిజాం ప్రారంభించిన ఉస్మా నియా విశ్వవిద్యాలయంలోని ప్రధాన కళాశాల ఇది. ఒకప్పుడు ఈ ఒక్క భవనంలోనే అన్ని కోర్సులు నిర్వహించారు. ఆ తర్వాత పలు కళాశాలలు నిర్మించారు. అజంతా, అరబిక్, రాజస్థానీ నిర్మాణ శైలితోపాటు ఇతర దేశాలకు చెందిన నిర్మాణ అంశాలను కూడా జోడించారు.
3: బేగంపేట విమానాశ్రయం
ఇది బ్రిటిష్ ఇండియాలో ప్రాచీనమైన విమానాశ్ర యం. బేగంపేట విమానాశ్రయాన్ని 1930లో నిజాం రాజు ప్రారంభించిండు. 1937 లో టెర్మినల్ భవనం నిర్మించారు. 1972 లో క్రొత్త టెర్మినల్ భవనం నిర్మిం చారు. ఇందులో విమానయానం, విమాననిర్మాణాల ను వివరించే మ్యూజియం కూడా ఉంది.
4: బిర్లా ప్లానిటేరియం
విశ్వం ఎలా పుట్టింది. నక్షత్రాలు ఎలా లెక్కిస్తారు, నక్షత్ర మండలాలను ఎలా గుర్తించవచ్చో తెలుసుకోవాలంటే ఈ ప్లానిటేరియంలో కూర్చుంటే చాలు ఆకాశాన్ని కళ్లకు కట్టేస్తారు. ఈ ప్రానిటేరియం పక్కనే ఆర్కియాలజీ మ్యూజియం ఉంది. ఇందులో ఆదిలాబాద్ అడవుల్లో సేకరించిన డైనోసార్ అవశేషాలతో డైనోసారియం' అనే మ్యూజియం నిర్వహిస్తున్నారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని సైన్స్ మ్యూజియంలో చూడొచ్చు. సైన్స్ పాఠ్యపుస్తకాల్లో చదివే పలు భౌతిక ప్రయోగాలను ఈ మ్యూజియంలో చేసి వైజ్ఞానిక విశేషాలను తెలుసుకోవచ్చు.
5 : కింగ్ కోరి ప్యాలెస్
కమల్ ఖాన్ అనే సంపన్నుడు దీన్ని నిర్మించాడు. నిజాం తన పాలనను దర్బార్ హాల్ (పబ్లిక్ గార్డెన్)కు మార్చిన తర్వాత సౌకర్యం కోసం దీనిని కొనుగోలు చేశాడు. 1911లో ఇందులోకి అడుగుపెట్టారు. పరదా కప్పి ఉండే గేట్ ఈ ప్యాలెస్ లోని ప్రత్యేకతలలో ఒకటి. ఇందులో నిజాం కోసం ఏర్పాటు చేసిన విశాలమైన గ్రంథాలయం, విలాసవంతమైన గదులున్నాయి. ఏదో నిజాం భార్యలు, వాళ్ల పిల్లలు కూడా కూడా ఈవిశాలమైన ప్యాలెస్ లోనే నివసించేలా ఏర్పాట్లు చేశారు. ఆయన మరణానంతరం దీనిలోని కొంత భాగాన్ని వైద్యశాల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. ఈ ప్యాలెస్ వల్ల ఆ ప్రాంతానికి కింగ్ కోరి అనే పేరు స్థిరపడింది.
6 : బ్రిటీష్ రెసిడెన్సీ
నిజాం పాలకులకు, బ్రిటీష్ వారికి సైనిక సహకార ఒప్పందం కుదిరిన తర్వాత బ్రిటీష్ పాలకుల కోసం దీనిని నిర్మించాడు. ఇది అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను పోలీ ఉంటుంది. 1857లో జరిగిన ప్రథమ స్వతంత్య్ర సంగ్రామ ప్రభావంతో ప్రజలు దీనిపై కూడా దాడి చేశారు. ఆ దాడి జ్ఞాపకాలు, త్యాగాల గుర్తులు ఇప్పటికీ అక్కడ పదిలంగా ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించిన తర్వాత అందులో మహిళా కళాశాల నిర్వహిస్తున్నారు.
7: సాలార్జంగ్ మ్యూజియం
సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతి పెద్ద మ్యూజి యం. ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాల కళాత్మక వస్తువుల భాండాగారం, నిజాం నవాబుల వద్ద పరిపాలకులుగా ఉన్న 'సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలు మూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించిం ది.
ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులు, నగలు, నగిషీలు, యుద్ధసామగ్రి, పర్షియా తివాసీలు మొదలగునవి ఉన్నాయి. ఈ సేకరణల్లో మూడో సాలార్ జంగ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే. ఎక్కువ. కొన్ని అతని తండ్రి, తాత సేకరించినవి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దేశ విదేశాల్లో పర్యటించి అద్భుతమైన కళాఖండాలను సేకరించిండు. నలభై సంవత్సరాల కాలంలో అతను సేకరించిన విలువైన, అరుదైన కళాఖండాలన్నీ సాలార్ఆంగ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రదేశం: నయాపూల్, ఫోన్: 040 2457 6443, టికెట్: రూ. 20, సెలవు శుక్రవారం
8 : చార్మినార్
హైదరాబాద్ నగర చరిత్రలో ఇదో మైలురాయి. కుతుబ్ షాహీల పాలనకు ఇది సూచిక, కుతుబ్ షాహీలు నిర్మించిన అతి ప్రాచీనమైన కట్టడం ఇది. దీని కేంద్రంగానే నాలుగు వందల ఏళ్లలో హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది. నాలుగు ఎత్తయిన (160 అడుగులు) మినార్లు ఉన్నాయి కాబట్టే దీనిని చార్మినార్ అన్నారు. ఇది రెండంతస్తులు కట్టడం. రెండో అంతస్తులో మసీదు నిర్మాణం ఉంది. అనాటి ఫౌంటెన్ ఇప్పటికీ ఉంది. 840 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం ఉంది. ప్రతి మినార్లో నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. ప్రతి గ్యాలరీలో ఏక రీతిలో ఉండే ఆరు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీనికి సమీపంలోనే ఉన్న లాడ్ బజార్ లక్క గాజులు), యునానీ దవాఖాన, మహబూబ్ చౌక్ కూడా చూడదగినవి
సెలవు: లేదు
టికెట్: రూ. 5
9: చౌమహల్లా ప్యాలెస్
నాలుగు సౌధాలు ఉన్న ప్యాలెస్ ఇది. అందుకే దీనికి ఈ పేరు పెట్టారు. పర్షియాను పాలించిన ఖజర్ పాలకులు ప్యాలెస్ నిర్మాణ శైలిలో నాలుగో నిజాం సలాబాద్ జంగ్ పాలనా కాలంలో దీని నిర్మాణం ప్రారంభమైంది. 1880లో నిర్మాణం పూర్తయింది. ఈ ప్యాలెస్ లోని ఖిల్వత్లో దర్బార్ నిర్వహించేవారు. ఈ చౌమహల్లాలో ఖరీదైన విదేశీ ఝూమర్లు ఫొటోలు, పెయింటింగ్స్, ఫర్నీచర్, ఆయుధాలను కూడా చూడొచ్చు. నిజాం కుటుంబ సభ్యులు ఉపయోగించిన వంట పాత్రలు. మొదలైనవెన్నో ఇందులోప్రదర్శనకు ఉంచారు.
సెలవు : శుక్రవారం,
ఫోన్: 040 4522032
టికెట్: 50 రూ. 1012 ఏళ్లలోపు పిల్లలకు ఫొటో కెమెరాకు రూ. 50, వీడియో కెమెరా రూ. 100
10 : పబ్లిక్ గార్డెన్
ఇది నిజాం కాలంలో జంతు ప్రదర్శనశాల. ఈ జంతు ప్రదర్శన శాలను తర్వాత బహదూర్పురాకు తరలించి పబ్లిక్ గార్డెన్ నిర్మించారు. ఇందులో శాసనసభా భవనం, శాసన మండల భవనం (జూబ్లీహాల్), బాలభవన్, హెల్త్ మ్యూజియం, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని నిజాం నవాబు తన మనుమరాలు బొమ్మలు దాచుకునేందుకు ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో దీనిని పురావస్తు మ్యూజియంగా అభివృద్ధి చేశారు. అత్యధిక సంఖ్యలో నాణేలు ఉన్న మ్యూజియాల లో ఇది ఒకటి. బాలభవన్లో నిజాం కాలంలో ఇండస్ట్రీయ ల్ మ్యూజియం నిర్వహించారు. జూబ్లీహాల్ ఏడో నిజాం దర్బార్ నిర్వహించేవాడు. ఆయనకు పట్టాభిషేకం అయిన ప్పుడు నిర్వహించిన జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం కొత్త దర్బార్ హాల్ నిర్వహించారు. అందుకే దానికి జూబ్లీ హాల్ అనే పేరు వచ్చింది..
11: నెహ్రూ జంతు ప్రదర్శనశాల
భారత దేశంలోని అతిపెద్ద జంతు ప్రదర్శనశాలలో ఇది ఒకటి. 1963లో బహదూరులో దీనిని ప్రారంభిం చారు. 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జంతు ప్రదర్శన లశాలలో సఫారీ చేస్తూ కీకారణ్యాలలోని కౄరమృగాల జీ వితాన్నిచూసిరావచ్చు. 'నేచురల్ హిస్టరీ మ్యూజియం'లో జీవ వైవిధ్యాన్ని, జీవ పరిణామం తెలుసుకోవచ్చు. యాంఫీ థియేటర్లోని ప్రకృతి పాఠశాల ఎన్నో వైజ్ఞానిక విశేషాల ను వివరిస్తుంది. 'జూ ఎడ్యుకేషన్'లో చెప్పే జంతు శాస్త్ర పారాలను సందర్శకులు ఎప్పటికీ మర్చిపోరు. పులులు, సింహాలు, చిరుతలు, ఏనుగులు, చింపాజీలు పలు సర్ప జాతులు (పాములు), పాలిచ్చే జంతువులు (క్షీరదాలు). వందల రకాల పక్షి జాతులు ఈ జూలో ఉన్నాయి.
సెలవు: సోమవారం
టికెట్: రూ.20, రూ.15 పిల్లలకు), ఫొటో కెమెరా రూ. 20, వీడియో కెమెరా రూ. 100
12 : గోల్కొండ కోట
ఇది దక్కను పాలించిన కుతుబ్ షాహీల పాలనా కేంద్రం. గోల్కొండ నగరం కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన వల్లరాతి కొండమీద కట్టారు. కోట చుట్టూ ఉన్న రక్షణ గోడ ఎత్తయిన బురుజులతో ఉంటుంది. పెద్ద పెద్ద ద్వారాలు, వాటి అలంకరణలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. అయిదు శతాబ్దాల క్రితం కోట నిర్మాణంలో మనవాళ్ల సామర్థ్యానికి ఈ కోట నిదర్శనం. కోటలో మూడు అంతస్తులలో నిర్మించిన సభామండపాన్ని 'బరాదరి' అంటారు. దీని నుండి గోషామహల్ బరాదరికి సొరంగ మార్గం ఉంది. చరిత్రలో పజ్రాల వేటకు, ముత్యాల వ్యాపారానికి గోల్కొండ ప్రసిద్ధిగాంచింది. ఆ సంపద పరిరక్షణ కోసం ఈ కోట పటిష్టంగా నిర్మించారు. ఈ కోటకు ఎనిమిది సింహ ద్వారాలున్నాయి. కోటలోపల నాలుగు వంతెనలు ఉన్నాయి. ప్యాలెస్లు, మసీదులు, కుతుబ్షాహీల సెక్రటేరియట్, ఉద్యానవనం, బావులు, బడీ బౌలి నుంచి అంతఃపురానికి, ఉద్యాన వనానికి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపైన్ ఇప్పటికీ ఉన్నాయి. 1200 గ్యాలన్ల నూనె నిల్వ చేసే భాండాగారము, కొత్త వారి ప్రవేశాన్ని పసిగట్టేలా నిర్మించిన క్లాప్ ఏరియా మొదలైన ప్రత్యేకతలెన్నో ఉన్న కోట ఇది. ఆషాఢంలో బోనాల జాతర మొదలయ్యేది ఈ కోటలోని ఎల్లమ్మ ఆలయంలోనే
ప్రవేశం: టికెట్ రూ. 15, ఫొటో కెమెరా రూ. 25, వీడియో కెమెరా రూ. 130
ఫోన్: 04023512401
సౌండ్ అండ్ లైట్ షో: రూ. 60 రూ. 140
13 : హరిణి వనస్థలి పార్క్
హైదరాబాద్ శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆటోనగర్ వద్ద ఈ పార్క్ ఉన్నది. 3,800 ఎకరాల స్థలంలో ఈ పార్క్ విస్తరించి ఉంది. హైదరాబాద్ స్టేట్ చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేట కోసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. 1994వ సంవత్సరంలో 'మహావీర్ హరిణ వనస్థలి' పేరుతో జాతీయవనం ఏర్పాటు చేశారు. ఇందులో కృష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, వివిధ రకాల పాములు, పక్షులు, సీతా కోక చిలుకలు ఉన్నాయి. ఇందులోనే.. చిలుకల కోసం ప్రత్యేకంగా ఒక హక్కు ఉంది. అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇందులోని వృక్షాలు దట్టమైన కారడవులను తలపిస్తాయి. పర్యాటకుల కోసం ఈ పార్కులో వసతి గృహాలు కూడా ఉన్నాయి.
పొన్: 040 2428 6523
సెలవు: సోమవారం
టికెట్: రూ. 20, పిల్లలకు రూ. 15 కెమెరా అనుమతించరు.
14 : స్పానిష్ మసీద్
చూపులకు చక్రలాగా ఉంటుంది.. కానీ ఇది మసీదు. దీనిని బేగంపేటలో వందేళ్లకు పూర్వం పాయిగా ప్రభువు ఇక్బాల్ ఉద్దేలా . దీనిని నిర్మించాడు. స్పెయిన్లోని
నిర్మాణ శైలిలో దీని నిర్మాణంఉంటుంది.
కాచిగూడ రైల్వే స్టేషన్
దక్షిణ మధ్య రైల్వేలో అందమైన స్టేషన్ ఇది. పెద్ద గుమ్మటము, దానికి రెండు వైపులా గుమ్మటాలు, మినార్లతో ఉన్న ఈ స్టేషన్ని చూడగానే ప్యాలెస్ అనిపిస్తుంది. ఎంతైనా నవాబులు నిర్మించినది. కదా! అంతేనా? ఇది నవాబుల కుటుంబ సభ్యులు రైలు ఎక్కేందుకు నిర్మించారట. నిజాం స్టేట్ గ్యారంటీడ్ రైల్వేడు ఇది ప్రధాన కేంద్రం. 1916లో నిర్మించారు.
లాల్ దర్వాజ సింహవాహిని ఆలయం
పాతబస్తీ బోనాలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ ఈ ఆలయ నిర్మాణానికి భూమిని దానం చేశాడు. నిజాం ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన మహారాజా కిషన్ పర్షద్ 1907లో దీనిని నిర్మించాడు. ఎర్రని దర్వాజాలు ఉండటం వల్ల దీనిని లాల్ దర్వాజా అని ఉర్దూలో పిలిచేవారు. శ్రీ సింహవాహినీ మహంకాళి ఆలయం ఇది. చార్మినార్కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రవేశం ఉచితం
పురానీ హవేలీ
యూరోపియన్ నిర్మాణ శైలిలో ఉన్న ఈ ప్యాలెస్ ను మెమెన్ సామ్రాజ్యం నుంచి వచ్చిన రుకుండల్లా నిర్మించాడు. 1717లో రెండవ నిజాం రాజు మీర్ నిజాం ఆలీ ఖాన్ దీనిని కొనుగోలు చేశాడు.. చౌమహల్లా ప్యాలెస్ కు ముందు రోజుల్లో నిజాంల అధికారిక నివాసం ఇది. అందుకే దీనిని 'పురానీ హవేలీ' అని పిలుస్తారు. 'పాత భవనం' అని దీని అర్థం. ఇందులో ఇప్పుడు నిజాంల పాలనా విశేషాలు, వైభవం, విలాసాలు తెలిపేందుకు నిజాం మ్యూజియం' నిర్వహిస్తున్నారు. ఇందులో నిజాం
రాజుల చిత్రాలు, దుస్తులు, ఆయుధాలు, వాహనాలు, ఆభరణాలు, వాళ్ల రాజముద్రలు,
ఫర్మానాలు ప్రదర్శనకు ఉన్నాయి.
ఫోన్: 040 2452 1029, టికెట్: రూ. 80, పిల్లలకు రూ. 15, కెమెరా: 150-500
సెలవు: శుక్రవారం
దక్షిణ తాజ్ మహల్.. పాయిగా టూంబ్స్
పాయిగా రాజు కుటుంబానికి చెందిన ఎనిమిది తరాల సమాధులున్నాయిక్కడ. 32 మంది రాజులు, రాజు కుటుంబీకుల సమాధులతోపాటు, చక్కని నిర్మాణ కళను ఇకడ చూడొచ్చు. మూడు వందల సంవత్సరాల చరిత్ర చెప్పే సమాధులివి. మొఘల్, గ్రీక్, పర్షియన్, అసఫ్ జాహీ, రాజస్తానీ, దక్కనీ నిర్మాణ శైలి సమ్మేళనం ఈ పాలరాతి కట్టడాలు, అందుకే దీనిని దక్షిణ తాజ్మహల్ ' అని చరిత్రకారులు అభివర్ణించారు.
సమాధిపై వేలాడే ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు, వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పును బట్టి రంగులు మారే మార్బుల్స్ ఇక్కడ చాలా ప్రత్యేకమైనవి. పర్షియన్ నిర్మాణ కళలో గోదల అలంకరణలో ఉండే స్టతో కళను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ తలుపులు తయారు చేశారు. ప్రకో కళతో తలుపులు, అడ్డు తెరలున్న నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు..ప్రవేశం ఉచితం. అన్ని రోజులూ సందర్శనకు అనుమతిస్తారు.
స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
ఈ గ్రంథాలయం మూసీ నది తీరంలో అల్గాంజ్లో ఉంది. ఈగ్రంథాలయం స్వాతంత్య్రానికి ముందు అసాఫియా లైబ్రరీగా ప్రసిద్ధి. ఈ గ్రంథాలయం ప్రస్తుతమున్న భవనాన్ని1891లో నవాబ్ ఇమాముల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ కట్టించాడు. ఈ భవనం అపూర్వ కళాఖండం. ఇంటాక్ హైద్రాబాద్ సంస్థ ఈ భవనాన్ని సంప్రదాయపారంపరిక వారసత్వంగా 1998లో ప్రకటించింది. గ్రంథాలయ భవనం 72,247 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు ఐదు లక్షల పుస్తకాలు, పత్రికలు, తాళ పత్ర గ్రంథాలు ఉన్నాయిక్కడ.
శిల్పారామం
గ్రామీణ, జానపద కళల ప్రదర్శన, హస్త కళా ప్రదర్శనతో నిత్యం సందర్శకులను ఆకట్టుకునే పట్నంలోని పల్లె శిల్పారామం మాదాపూర్లో సైబర్ టవర్ కు దగ్గర్లో ఉంటుంది శిల్పారామం. భారత దేశంలోని ప్రాచీన హస్త కళల సంప్రదాయాలని రక్షించే ఆలోచనతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఏడాది పొడవునా సంప్రదాయ పండుగలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల హస్త కళాకారులు నేరుగా తమ ఉత్పత్తులు అమ్ముతారు.
సంప్రదాయ ఆభరణాలు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, చేతితో చెక్కిన ఫర్నిచర్ మొదలైనవి ఇక్కడ కొనవచ్చు. పల్లె అందాల్ని తలపించే కోనసీమ, ఆధునిక శిల్పకళతో ఆలోచింపజేసే పార్క్, రాక్ గార్డెన్, గ్రామాలలోని చేతి వృత్తులను వివరించే రూరల్ మ్యూజియం, వినోదంతోపాటు పసందైన విందులు కూడా ఉండే నైట్ బజార్లో విహారం మరచిపోని అనుభూతి.
ఫోన్: 08886652004
టికెట్: రూ. 40, పిల్లలకు రూ. 20, బోటింగ్ రూ. 30, బ్యాటరీ కార్ ప్రయాణం రూ. 15
టోలి మసీదు
కుతుబ్ షాహీ నిర్మాణాలలో ఇది ప్రముఖమైనది. టోని మసీద్ నాలుగు వందల ఏళ్ల నాటి మసీదు ఇది. దీనిని స్థానికులు డత్రి మసీద్ అని కూడా పిలుస్తారు. గోల్కొండ కోట నుంచి చార్మినార్కు పోయే దారిలో కార్వాన్ వద్ద ఉంటుంది. హైదరాబాద్ నగరంలో నిర్మించిన మొదటి మసీదు మక్కా తర్వాత నిర్మించినది ఈ మసీదునే. పైభాగంలోని పిట్టగోడల ఆర్ట్స్ పైన ఉన్న శిల్పకళ అద్బుతమైనది. ఈ పిట్టగోడలపై మొత్తం ఐదు ఆర్ట్స్లు ఉన్నాయి. ప్రతి ఆర్కే, దానిని ఆవరించన దీర్ఘచతురస్రాల మధ్య అందమైన పద్యాలు చెక్కారు. మధ్యభాగంలోని ఆర్చి మిగిలిన నాలుగింటికన్నా పెద్దగా, ఎక్కువ శిల్పకళతో అలంకరించారు.