- అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో స్కూల్స్‌లో పనులు
- కామారెడ్డి జిల్లాలో 947 స్కూల్స్‌లో పనులకు 131 కంప్లీట్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో స్కూల్స్‌లో మౌలిక వసతుల కల్పన కోసం చేపడుతున్న పనులు స్లోగా సాగుతున్నాయి. మరో 6 రోజుల్లో స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. ప్రపోజల్చేసిన దాంట్లో కనీసం 25 శాతం వర్క్స్కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. స్కూల్స్రీ ఓపెన్ అయ్యే నాటికి వర్క్స్కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో వర్క్స్ ఆశించినంత స్పీడ్ గా జరగట్లేదు. రీ ఓపెన్ నాటికి వర్క్స్అసంపూర్తిగానే ఉన్నాయి. జిల్లాలో 1,013 స్కూల్స్‌కు గాను 947 స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పించేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్ చేశారు.
వర్క్స్ కోసం జిల్లాకు రూ.20 కోట్ల ఫండ్స్ కేటాయించారు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ , టాయిలెట్స్, మైనర్ రిపేర్స్, క్లాస్ రూమ్స్‌లో లీకేజీలు, డోర్లు, కిటీకీలు, కంపౌండ్‌వాల్ రిపేర్ వంటి వర్క్స్చేపట్టాల్సి ఉంది. వాటార్వర్క్స్రూ. లక్ష, టాయిలెట్స్‌కు రూ. 35 వేల లోపు,ఎలక్ర్టిసిటీ కోసం రూ.25వేల లోపు, మైనర్ రిపేర్లకు రూ. 2 లక్షలు ఖర్చు చేయాలి. విద్యా శాఖ నుంచి పనులు చేస్తున్న వారికి 25 శాతం డబ్బులు అడ్వాన్స్‌గా ఇచ్చారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో ఈ పనులు
జరగనున్నాయి.
ఆయా శాఖల ఆధ్వర్యంలో..
వర్క్స్ స్పీడప్గా చేయటానికి ఆయా ఇంజనీరింగ్ విభాగాలకు మండలాల వారీగా పనులు అప్పగించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, టీఈఎస్డబ్ల్యూడీసీ విభాగాలకు పనులు అప్పగించారు. ఇంజనీరింగ్ ఆఫీసర్లు స్కూల్స్‌ను విజిట్ చేసి ఏయే పనులు చేపట్టాలనే దానిపై ఎస్టిమేషన్ వేశారు.
స్టూడెంట్స్‌కు ఇబ్బందులు
స్కూల్స్‌లో మౌలిక వసతులు లేక స్టూడెంట్స్ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల క్లాస్రూమ్స్శిథిలం కావటం, పై కప్పులు లీకేజీ కావటం, పగుళ్లు , టాయిలెట్స్ కూడా అధ్వాన్నంగా మారాయి. డ్రింకింగ్ వాటర్ లేక ఎక్కువ మంది స్టూడెంట్స్ఇంటి నుంచే బాటిల్స్ తీసుకెళ్తున్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టే పనులు వేగంగా జరిగినట్లయితే స్కూల్స్ రీఓపెన్ నాటికి మౌలిక వసతులు సమకూరుతాయని తల్లిదండ్రులు భావించారు. ఎలక్షన్కోడ్, ఆఫీసర్లు ఎలక్షన్వర్క్స్ఉండటంతో పనుల్లో కొంత స్పీడప్ తగ్గిందని విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరుకు కంప్లీట్ అవుతాయని చెబుతున్నారు.
131 స్కూల్స్‌లో కంప్లీట్
జిల్లాలో ఇప్పటి వరకు 131 స్కూల్స్‌లో వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 816 స్కూల్స్ వర్క్స్ కంప్లీట్ కావాల్సి ఉంది. కొన్ని చోట్ల పనులు షురు చేసి ఆపేశారు. పిట్లంలో 17, లింగంపేటలో 14, మాచారెడ్డిలో 12, గాంధారిలో 11, కామారెడ్డిలో 10, మిగతా మండలాల్లో 4 నుంచి 7 స్కూల్స్‌లో వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పలు మండలాల్లో పర్యటించి వర్క్స్‌ను పరిశీలించారు. వర్క్స్ స్పీడప్ చేయాలని ఆఫీసర్లకు ఆదేశించారు. డ్రింకింగ్‌వాటర్, టాయిలెట్స్ పనులు కొంత వేగంగా జరుగుతున్నప్పటికీ రిపేర్లు, ఎలక్ర్టిఫికేషన్ వర్క్స్ లో వెరీ స్లో ఉంది.