Jio AirFiber: ఒక కనెక్షన్..120 డివైజ్ లకు ఇంటర్నెట్..వివరాలిగో

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఫిక్స్ డ్ వైర్ లెస్ యాక్సెస్  సర్వీస్,జియో ఎయిర్ ఫైబర్ ను దేశవ్యాప్తంగా 7వేల పట్టణాలు, నగరాల్లో విస్తరిస్తోంది. 5G నెట్ వర్క్ ఉన్న  అన్ని ప్రాంతాల్లో ఈ సేవలను కవర్ చేస్తోంది. ఇందులో భాగంగా Jio దాని AirFiber ద్వారా వినియోగదారులకు అందించే Wi-Fi కనెక్షన్‌తో గరిష్టంగా 120 పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చని ధృవీకరించింది. కనెక్ట్ చేయబడిన డివైజ్ లకు సమానంగా ఇంటర్నెట్ వేగం పంపిణీ అవుతుందని తెలిపింది. దీనికోసం బేసిక్ ప్లాన్ గా 30Mbps సరిపోతుందని తెలిపింది. 500 Mbps లేదా 1Gbps జియో ప్రత్యేక ప్లాన్ల ద్వారా మరింత వేగంగా ఇంటర్నెట్ అందుకోవచ్చని సూచించింది.

ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ తో OTT వంటి బెనిఫిట్స్, ఎక్కువ కంటెంట్ అందించడం ద్వారా కస్టమర్లకు మంచి అనుభూతిని పొందవచ్చు.  ఒకేసారి 120 మొబైల్ నెట్ వర్క్ లలో పెరిగిన వినియోగం వలన జియో ఎయిర్ ఫైబర్ నెట్వర్క్ వేగంలో ఎలాంటి మార్పు ఉండదు. ఫైబర్ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో Jio AirFiber ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. లేటెస్ట్ FWA టెక్నాలజీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ను అందిస్తుంది.  Jio Air Fiber  ఒక జియో సెటప్ బాక్స్ తో వస్తుంది. లైవ్ టీవీ చానెల్స్, 15 కంటే ఎక్కువ OTT సేవల నుంచి కంటెంట్ అందించడం ద్వారా కస్టమర్లకు ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తోంది.