చెట్టును ఢీకొట్టిన స్కూల్​ పిల్లల ఆటో..12 మందికి గాయాలు

దుబ్బాక, వెలుగు : సిద్దిపేట జిల్లా దుబ్బాక శివారులోని మలుపు వద్ద స్కూల్​ పిల్లల ఆటో చెట్టును ఢీకొనడంతో 12 మందికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ​మండలంలోని కమ్మర్​పల్లికి చెందిన 13 మంది స్టూడెంట్స్​రోజు మాదిరిగానే మంగళవారం ఆటోలో దుబ్బాకలోని ఓ  ప్రైవేట్​ స్కూల్​కు వెళ్తున్నారు. దుబ్బాక శివారులోని మలుపు వద్దకు రాగానే డ్రైవర్​ అజాగ్రత్త వల్ల ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో స్టూడెంట్స్​ఒకరిపై ఒకరు పడడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పేరెంట్స్​ గాయపడిన పిల్లలను సిద్దిపేటలోని ప్రైవేట్​ ఆస్పత్రులకు తరలించారు. ప్రతి రోజు ఆటోలో 22 మంది స్టూడెంట్స్​ వచ్చేవారని, ఈ రోజు 13 మంది రావడంతో ప్రమాదం తప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.