ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

  • 114 ఫిర్యాదుల స్వీకరణ

కామారెడ్డి​ ​, వెలుగు :  కామారెడ్డి కలెక్టరేట్​లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 114 ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి  ఫిర్యాదులు స్వీకరించారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులకు  అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని,  అర్జీలను వెంటనే పరిష్కరించాలని  ఆఫీసర్లకు ఆదేశించారు.  ప్రజావాణితో పాటు  సీఎం ఆఫీసు నుంచి వచ్చే ఫిర్యాదులపైదృష్టి సారించాలని చెప్పారు.  

వన మహోత్సవాన్ని సక్సెస్​ చేయాలి

జిల్లాలో వనమహోత్సవాన్ని సక్సెస్​ చేయాలని  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ పిలుపునిచ్చారు.   ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడుతూ...  జిల్లాలో మొత్తం 17  లక్షల 88వేల మొక్కలను నాటాలన్నారు.  ప్రతి శాఖకు కేటాయించిన టార్గెట్​ను కంప్లీట్​ చేయాలన్నారు  స్కూల్స్​, రెసిడెన్సియల్ స్కూల్స్​లో కంపల్సరీగా మొక్కలు నాటాలన్నారు.  అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి,  డీఆర్డీవో చందర్​,  డీపీవో శ్రీనివాస్​రావు,  ఎస్సీ కార్పోరేషన్​ ఈడీ దయానంద్​, సీపీవో రాజారాం తదితరులు పాల్గొన్నారు.