ప్రజావాణిలో 114 దరఖాస్తులు

కామారెడ్డి టౌన్, వెలుగు :  కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 114 దరఖాస్తులు వచ్చాయి.   కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​, అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం ప్రజలు అందజేసిన దరఖాస్తులు ఆయా శాఖల ఆఫీసర్లు సత్వరమే పరిష్కరించాలన్నారు.  కార్యక్రమంలో జెడ్పీ సీఈవో చందర్,  డీపీవో శ్రీనివాస్​రావు, డీఆర్​డీవో సురేందర్​,  ఏవో మన్సూర్​ అహ్మద్​ తదితరులు పాల్గొన్నారు. 

లోన్ల రెన్యూవల్​పై  ఫోకస్​ చేయండి

పంట రుణమాఫీ జరిగిన రైతులకు లోన్ల రెన్యూవల్​ విషయంలో  ఆఫీసర్లు ప్రత్యేకంగా  చర్యలు చేపట్టాలని కలెక్టర్​ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో  ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు.  ఎస్బీఐ, డీసీసీబీ లోన్​ రెన్యూవల్​ శాతం మరింతగా పెంచాలన్నారు.  కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్,  ఎల్​డీఎం రవికాంత్,  బ్యాంక్​ ఆఫీసర్లు  సుమమాల, శాండిల్య, చంద్రశేఖర్​ తదితరులు పాల్గొన్నారు.