రాజన్న ఆలయంలో బురదలో రాజన్న కోడెలు

రాజన్న ఆలయంలో కోడె మొక్కులకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. అలాంటి రాజన్న కోడెల విషయంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉండగా ఒకటి కట్ట కింద, రెండోది తిప్పాపురం లో ఉంది. వానాకాలంలో కోడెల సంరక్షణలో చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కురుస్తున్న వానలకు గోశాల మొత్తం బురదమయంగా మారింది.

వారం రోజులుగా దాదాపు 1000 కోడెలు ఆ బురద నీటిలోనే అవస్థలు పడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. మరోవైపు మేత వేయాలన్నా కష్టంగా మారింది. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల సంరక్షణపై దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.  కాగా ఆదివారం రాజన్న గోశాలను ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా పరిశీలించారు. కోడెలు పరిస్థితిపై ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు. వెంటనే కొత్త షెడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.   

వేములవాడ, వెలుగు.