సైంటిస్టుల హెచ్చరిక: ఈ వైరస్..కరోనా కంటే వందరెట్లు ప్రమాదకరం..ప్రాణాంతకం

కరోనా..ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి. పేరు తలచుకుంటేనే వణుకుపుడుతుంది.దాదాపు నాలుగేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించింది.ఏండ్లపాటు జనాన్ని ఇండ్లనుంచి బయటికి రాకుండా ఒకరితో ఒకరు కలవకుండా చేసింది. అంతేనా..ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టన పెట్టుకుంది.. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు మరోషాక్.. కరోనా కంటే వంద రెట్లు ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన మహమ్మారి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే H5N1 బర్డ్ ఫ్లూ వైరస్..

H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కరోనా (కోవిడ్ 19 ) కంటే ప్రాణాంతకం, ఘోరమైనదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మానవులతోపాటు అనేక క్షీరదాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. పిట్స్ బర్గ్ లోని ప్రముఖ బర్డ్ ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేష్ కూచిపూడి వైరస్ తీవ్రతకు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.ఇది కరోనా కంటే శక్తివంతమైనది.. ఈ వైరస్ చాలా ప్రమాదకరం. మరో మహమ్మారికి దగ్గరలో ఉన్నాం అని చెబుతున్నారు. ఇప్పటికే జంతువుల్లో క్షీరదాలకు సోకింది. ఇది వ్యాప్తి చెందుతోంది. మనం అలర్ట్ కావాల్సిన సమయం వచ్చిందంటున్నారు.