కరీంనగర్ లో భారీగా గంజాయి పట్టివేత..

కరీంనగర్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. జూన్ 1వ తేదీ శనివారం నగర శివారులోని కేబుల్ బ్రిడ్జి దగ్గర కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  ఈక్రమంలో అనుమానాస్పదంగా సిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురుని ప్రశ్నించారు పోలీసులు.  వారిచ్చిన సమాధానం స్పష్టంగా లేకపోవడంతో అనుమానం వచ్చి.. కారును తనిఖీ చేశారు. 

కారులో వెనక సీటు కింద దాచి అక్రమంగా రవాణా చేస్తున్న  గంజాయిని గుర్తించారు.  35 ప్యాకెట్లలో సుమారు 100 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుఅలు గుర్తించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:రూ. 700 కోట్ల స్కామ్లో మాజీ మంత్రి తలసాని ఓఎస్‌‌‌‌డీ