సిరిసిల్లలో 100 పడకల..ఈఎస్ఐ హాస్పిటల్ ప్రపోజల్ రాలేదు

  • రాజ్యసభలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభ 

న్యూఢిల్లీ, వెలుగు:తెలంగాణలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రపోజల్ తమకు రాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గురువారం రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరండ్ లాజే రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.