IPL 2025: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్.. ఒక ఫారెన్ ప్లేయర్‌పై 10 జట్ల కన్ను

ఐపీఎల్ మెగా ఆక్షన్ కు రంగం సిద్ధమైంది. మరో వారంలో అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా వేలం ప్రారంభం కానుంది.  నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితాను శుక్రవారం (నవంబర్ 15) ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం 574 మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. మెగా ఆక్షన్ లో ఒక ఫారెన్ ప్లేయర్ పై ఏకంగా 10 జట్లు ఎదురు చూస్తున్నాయి. అతడెవరో ఇప్పుడు చూద్దాం. 

ఇంగ్లాండ్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఏకంగా 10 జట్లు ఈ ఇంగ్లీష్ స్టార్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఐపీఎల్ లో ప్రతి జట్టుకు సాలిడ్ ఓపెనర్ కావాలి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కెప్టెన్సీ అవసరం ఉంది. కొన్ని జట్లకు వికెట్ కీపర్ అవసరం ఉంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా బట్లర్ ఈ మెగా ఆక్షన్ లో జాక్ పాట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

ఐపీఎల్ 2025 ఆక్షన్ కు ముందు స్టార్ ప్లేయర్ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అతడిని రిటైన్ చేసుకోకుండా 2025 మెగా ఆక్షన్ లోకి వదిలేసింది. తాజాగా రాజస్థాన్ విడుదల చేసిన రిటైన్ ఆటగాళ్లలో కెప్టెన్ సంజు శాంసన్ కు రూ. 18 కోట్లతో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు సైతం రూ. 18 కోట్లు ఇచ్చి టాప్ రిటైన్ ప్లేయర్లుగా తీసుకున్నారు. యువ క్రికెటర్ రియాన్ పరాగ్, వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ఇద్దరూ చెరో రూ. 14 కోట్ల రూపాయలు దక్కాయి. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్  షిమ్రోన్ హెట్మెయర్ కు రూ. 11 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ గా సందీప్ శర్మకు రూ. 4 కోట్ల రూపాయలతో జట్టులో కొనసాగనున్నాడు.