- బస్సు డ్రైవర్ పరిస్థితి విషయం
భిక్కనూరు, వెలుగు: వాటర్ ట్యాంకరును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగపల్లి గ్రామ సమీపంలోని నేషనల్ హైవేపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళుతున్న నిర్మల్ డిపోకు చెందిన లగ్జరీ బస్సు జంగంపల్లిలోని ఏ1 దాబా ఎదురుగా వాటర్ ట్యాంకర్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది.
సూచికలు ఏర్పాటు చేసుకుని డివైడర్ మధ్యలో వాటర్ ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీళ్లు పోస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ట్యాంకర్ ను ఢీకొనడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. కోలమద్ది గ్రామంకు చెందిన బస్సు డ్రైవర్ గోపాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. భిక్కనూరు సీఐ సంపత్ , ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.