టెన్షన్ గా ఉన్నారా డాన్స్ చేయండి.. ఆందోళనగా ఉన్నారా డాన్స్ చేయండి.. బీపీ పెరుగుతుందా డాన్స్ చేయండి.. కోపం వస్తుందా డాన్స్ చేయండి.. ఇన్నాళ్లు చెప్పిన.. విన్న మాటలు ఇవి.. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. డాన్స్ చేస్తున్నారా.. మీకు గుండెపోటు రావొచ్చు.. డాన్స్ చేస్తున్నారా.. ఎప్పుడు ఎవరు కుప్పకూలి చనిపోతారో తెలియదు.. డాన్స్ చేస్తున్నారా మీరు ఏమైనా కావొచ్చు.. అవునండీ.. 24 గంటల్లో.. అంటే అక్టోబర్ 21వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 22వ తేదీ రాత్రి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలు.. ఇలాంటి భయాన్నే ఇస్తున్నాయి. దసరా సంబురాల్లో డాన్స్ చేస్తూ.. దాండియా ఆడుతూ.. గాబ్రా డాన్స్ చేస్తూ.. అక్కడికక్కడే కుప్పకూలి.. అక్షరాల 10 మంది చనిపోయారు. అప్పటి వరకు సంబురాల్లో ఆడుతూ పాడుతూ కనిపించిన వారు.. కళ్ల ముందు విగతజీవులుగా మారారు..
గుజరాత్‌లో ఇటీవల గర్బా ఆడుతూ 24 గంటల్లో 13 ఏళ్ల బాలుడితో సహా 10 మంది గుండెపోటుతో మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో నవరాత్రి వేడుకలు గుజరాత్‌లోని కుటుంబాలకు విషాదకరమైన జ్ఞాపకాలను మిగిల్చాయి. బాధితుల్లో, 13 ఏళ్ల చిన్నారి బరోడాలోని దభోయ్‌కు చెందినది కాగా, మిగతా వారిలో టీనేజర్ల నుంచి మధ్య వయస్కుల వరకు ఉన్నారు. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల గర్బా ఔత్సాహికుడు స్పృహ కోల్పోయి కుప్పకూలి మరణించాడు. అంతేకాకుండా, ఖేడా జిల్లాలోని కపద్వాంజ్‌లో గర్బాలో నిమగ్నమై ఉండగా, 17 ఏళ్ల బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై, మరణించాడు.
Also Read : నిజమేనా ఇది : కాంగ్రెస్లోకి రాజగోపాల్ అంటూ ప్రచారం
ఈ సంఘటన వివరాలను పంచుకుంటూ, మెడిసిన్ MD డాక్టర్ ఆయుష్ పటేల్.. "వీర్ షా అనే 17 ఏళ్ల బాలుడు కపద్వాంజ్‌లోని గార్బా మైదానంలో గర్బా ఆడుకుంటుండగా, మైకంతో బాధపడుతూ స్పందించలేదు. వాలంటీర్ల బృందం సంఘటనా స్థలంలో వెంటనే అతన్ని పరిశీలించి, కార్డియో-రెస్పిరేటరీ చేశాం. మేము అతని పల్స్ రేట్స్ ను పర్యవేక్షించాము, కానీ పల్స్ కొట్టుకోలేదు. ఎటువంటి ప్రతిస్పందన, శ్వాస సంకేతాలు లేవు. అనంతరం అతనికి సీపీఆర్ చేసి, ఆస్పత్రిలో ఆసుపత్రికి తరలించాం. అయితే, అతను ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు".
కావున.. డ్యాన్స్ అనేది నిజంగా గుండెపోటుకు కారణమవుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు అందర్లోనూ మెదులుతోంది. డ్యాన్స్ సాధారణంగా ఆరోగ్యానికి మంచిది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులలో ఇది నేరుగా గుండెపోటుకు కారణం కాదు. మరి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై, మరణం బారిన పడడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఉన్న గుండె పరిస్థితులు: మీకు ఇప్పటికే గుండె సమస్యలు, మూసుకుపోయిన ధమనులు, సక్రమంగా లేని హృదయ స్పందనలు లేదా గుండె వైఫల్యం వంటివి ఉంటే, తీవ్రంగా డ్యాన్స్ చేయడం వల్ల మీ గుండెపై అదనపు భారం పడుతుంది. కావున మీ గుండె సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి కఠినమైన నృత్యాలు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
అధిక శ్రమ: డ్యాన్స్ అనేది శరీరానికి గొప్ప వ్యాయామం. కానీ వేగంగా చేయడం వల్ల అనేక సమస్యలకు దారితీయవచ్చు. డీహైడ్రేట్ కావటం, అలసట, మీ గుండెపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చు. కావున డ్యాన్స్ చేసేటప్పుడు విరామం తీసుకోవడం, నీరు తాగడం చాలా ముఖ్యం.
ఆల్కహాల్ లేదా డ్రగ్స్ వినియోగం: డ్యాన్స్ చేసేటప్పుడు ఆల్కహాల్ లేదా డ్రగ్స్ ఉపయోగించడం మీ గుండెకు ప్రమాదకరం. ఈ పదార్థాలు మీ హృదయ స్పందన రేటు, రక్తపోటును ఇబ్బందుల్లో నెట్టుతాయి. ఇది గుండె సమస్యలకు దారితీయవచ్చు. కావున డ్యాన్స్ చేసేటప్పుడు వాటికి దూరంగా ఉండటం మంచిది.
విపరీతమైన డ్యాన్స్ స్టైల్స్: బ్రేక్ డ్యాన్స్ లేదా ఇంటెన్స్ ఏరోబిక్ డ్యాన్స్ వంటి కొన్ని డ్యాన్స్ స్టైల్స్ నిజంగా శారీరకంగా ఎక్కువ శ్రమని తీసుకుంటాయి. మీరు ఈ రకమైన స్టైల్స్ కు అలవాటుపడకపోతే పర్లేదు. కావున మీరు మంచి స్థితిలో ఉన్నారని నిర్ధారించుకున్నాకే.. ఈ తరహా స్టైల్స్ ను అనుసరించండి.
'అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారు గర్బాకు దూరంగా ఉండాలి'
పట్టణాలు, ఇతర నగరాల్లో కమర్షియల్ 'గార్బా' ఈవెంట్‌ల నిర్వాహకులు వేదిక వద్ద అంబులెన్స్, వైద్య బృందాన్ని పెడుతున్నారు. తద్వారా ఈవెంట్ లో పాల్గొనేవారికి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందుతుంది.
గుజరాత్ ప్రభుత్వ సర్క్యులర్‌లో ఈ రూల్ ను పాటించకపోతే ఎటువంటి శిక్షార్హమైన చర్య గురించి ప్రస్తావించలేదు, కానీ నిర్వాహకులు సమ్మతి గురించి హామీ ఇచ్చిన తర్వాతే అనుమతి ఇస్తామని మంత్రి చెప్పారు. "రక్తపోటు సమస్య లేదా పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో చికిత్స పొందాలనేది ఈ ఆదేశం వెనుక ఉన్న ఉద్దేశం" అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ చెప్పారు.
గర్బా వేదికలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, ఇతర సిబ్బంది నవరాత్రుల సందర్భంగా అర్ధరాత్రి వరకు విధుల్లో ఉండాలని కోరినట్లు పటేల్ తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడేవారు గర్బా ఆడకుండా ఉండాలని కూడా ఆయన అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) అహ్మదాబాద్ చాప్టర్ కూడా 40 ఏళ్లు పైబడిన వారికి గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు గర్బా డ్యాన్స్‌లో పాల్గొనే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.