అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తిరస్కరించినా....బీఆర్ఎస్‌‌ లీడర్లకు బుద్ధి రాలేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: అసెంబ్లీ, పార్లమెంట్‌‌ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లకు బుద్ధి రాలేదని, సీఎం రేవంత్‌‌రెడ్డిపై కేటీఆర్‌‌‌‌ ఫ్రస్టేషన్‌‌లో వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని, ఇక నుంచి అలా మాట్లాడితే ఊరుకోమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ హెచ్చరించారు.  ప్రజల పక్షాన జైలుకు వెళ్తానని కేటీఆర్‌‌‌‌ అంటున్నాడని, ఆయన ఏ పోరాటం చేశాడని వెళ్తాడని ఎద్దేవా చేశారు. వేములవాడ అర్బన్‌‌ మండలం రుద్రవరంలో మిడ్​మానేరు బ్యాక్‌‌వాటర్‌‌‌‌లో ఆదివారం 80 వేల చేప పిల్లలను వదిలారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌‌‌‌ తమ పార్టీ లీడర్లను వ్యక్తిగతంగా విమర్శిస్తే.. తాము అదే రీతిలో ఆయనకు బదులిస్తామన్నారు. బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల నేతన్నలను కేటీఆర్‌‌‌‌ ఆగం చేసిండని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లలో ఎందుకు యారన్ డిపో ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

మిడ్ మానేరు పరిధిలోని రుద్రవరం గ్రామంలో గతంలో కేజీ కల్చర్‌‌‌‌పై అవగాహన కల్పించామని, మత్స్యకారులు ముందుకు వస్తే సబ్సిడీ ద్వారా చేపల పెంపకం యూనిట్ మంజూరుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు అనుపురం, సంకేపల్లి గ్రామాల్లో కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.  ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, అడిషనల్‌‌ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, లీడర్లు పాల్గొన్నారు. 

జర్నలిస్టుల కుటుంబానికి  పరామర్శ

కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలోని జర్నలిస్టులు డప్పుల కరుణాకర్, నరేశ్‌‌ల తల్లి దేవవ్వ ఇటీవల చనిపోయారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాడ సానుభూతిని తెలిపారు.