Summer Special : పిల్లలు ఆడుతం అంటే.. ఆడనియ్యాలె.. స్మార్ట్ ఫోన్లకు దూరం పెట్టండి..!

ఆ పిలగానికి మూడేళ్లు టైం దొరికితే చాలు బయటికెళ్లి చేతికి దొరికిన దానితో ఆడుకోవాలనుకుంటడు. కానీ, వాడు అడుగు బయటపెట్టంగనే వాళ్ల అమ్మ ..ఎత్తుకొచ్చి బొమ్మ బండిలో కూర్చొబెట్టి..'ఆడుకో' అంటది. ఏడిస్తే.. స్మార్ట్ఫోన్ ఇస్తది. ఇగ ఆ పిలగాడు నప్పుడు చెయ్యడు. 'నడుస్తా' అన్న నడపనియ్యదు. ప్రామ్స్ కూర్చొబెట్టి షాపింగ్ చేస్తది. పిలగానికి మట్టి కూడా అంటనియ్యదు.

 'ఆహా మా పిల్లలను మట్టి అంటనియ్యకుండ పెంచుతున్నం అని మస్తు మురుస్తరు తల్లిదండ్రులు. ప్రపంచంల ఇట్లాంటి పేరెంట్సే ఎక్కువున్నరంట! వీళ్ల ప్రేమ వల్ల పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ కరువైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) అంటోంది. అంతేనా. పిల్లలు మంచిగ ఎదగాలంటే స్మార్ట్ఫోన్, టీవీ స్క్రీన్ ముందుపెట్టి ఉత్తగా కూసొవెట్టెద్దు. ఐదేండ్లలోపే పిల్లలను బాగా ఆడిపియ్యాలె. ఆడనియ్యాలి' అని తాజాగా కొన్ని రికమెండేషన్స్ కూడా తెచ్చింది.

చిన్నతనంలనే పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ మంచిగ ఉంటే.. వాళ్ల ఆరోగ్యానికి బాటలు పడినట్టే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ' ఆరోగ్యం కూడా ఒక లక్ష్మమే. జీవితం సంతోషంగా సాగాలంటే ఆరోగ్యానిదీ ముఖ్యపాత్రే. ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే.. చిన్నప్పటి నుంచే దానికి కావాల్సిన కసరత్తు మొదలు పెట్టాలె' అని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెట్రోస్ అధాన గెబ్రియెషన్ అన్నడు. 

'చిన్నప్పటి సందే యాక్టివిటీలను అడ్డుకోకుండా ఆటలు, పాటలు అలవాటు చేస్తే పెద్దగైనంక అది లైఫ్ స్టైల్లో భాగమైతది. అదే ఆరోగ్యంగా ఉండటానికి సాయపడుతుద'ని చెప్పిందాయన.

సరిగ్గా నిద్రపోతలేరు..

ఐదేండ్ల లోపు పిల్లలు సరిగ్గా నిద్ర పోతలేరు. ఇట్ల నిద్రపోనోళ్లు ఊబకాయంతో బాధపడుతున్నరు. వీళ్ల ఎదుగుదల బాగా ఉండటం లేదు. పెద్దగైనంక కూడా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడతున్నరు. ఐదేళ్లలోపు సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వాళ్లను బలవంతంగా కూర్చోబెట్టడమే ఈ సమస్యలన్నింటికీ కారణమని డబ్ల్యూహెచో అన్నది. దీనికి నిపుణుల ప్యానల్ పిల్లల కోసం కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది. 

యాక్టివిటీ లెవల్స్ పెంచడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నయని చెప్పుకొచ్చింది. 'ఫిజికల్ యాక్టివిటీని పెంచి.. కూర్చునే తగ్గించడం వల్ల పిల్లలకు మంచి నిద్ర అందుతది. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగైతది. అప్పుడే సంతోషంగా గడపగలుగుతరు. చిన్నతనంలో వచ్చే ఊబకాయం వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు" అని చెప్పింది. డబ్ల్యూహెచ్పీ.

ఫిజికల్ యాక్టివిటీ లేకే..

డబ్ల్యూహెచోవో చెప్పిన ఫిజికల్ యాక్టివిటీ ప్రమాణాలను అందుకోకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏజ్ గ్రూప్ కలిపి 50 లక్షల మంది చనిపోతున్నరు. ప్రస్తుతం 23 శాతం మంది టీనేజ్, 80 శాతం వయసు వాళ్లు సరైన ఫిజికల్ యాక్టివిటీ చెయ్యడం లేదు. చిన్నప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తే ఊహ వచ్చేనాటికి అది ఒక అలవాటుగా మారి జీవితాంతం కొనసాగిస్తదని డబ్ల్యూహెచో చెప్పింది.

'పిల్లల్ని ఆడించే రోజులను మనమంతా కలిసి వెనక్కి తీసుకురావాలె. వాళ్లను ఆడనియ్యాలి. ఇప్పుడు పని చెప్పాల్సింది కుర్చీలకు, బొమ్మలకు కాదు. కాళ్లు, చేతులకు' అని డబ్యూహెచో పిలుపునిచ్చింది. చిన్నప్పుడు ఎక్కువగా ఆడినోళ్లు పెద్దోళ్లు, పెద్దోళ్ల దగ్గర కథలు విన్న పిల్లలే జీవితంలో మంచిగా రాణిస్తరని కూడా అన్నది! 'అందుకే ఎక్సర్ సైజ్ తో పాటు పిల్లలకు కథలు చెప్పాలె. పాడటం నేర్పాలె. పజిల్స్ ని పరిష్కరించమనాలె. వీటన్నింటికి పెద్దోళ్ల బాధ్యత తీసుకోవాల ని చెప్పింది. 

ఇవే ఆ రికమెండేషన్స్ పదాలలోపు శిశువులు

ఏడాదిలోపు పిల్లలకు కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంచటం చాలా ముఖ్యం. వీళ్లను ఫ్లోర్పై ఆడే ఆటలు ఆడించాలి. అయితే, ఈ సమయంలో ఫోన్ మాత్రం ఇవ్వొద్దు. రోజులో కనీసం 30 నిమిషాలన్నా బోర్లా పడుకుని ఆడుకునేలా చూడాలి. విరామం లేకుండా గంట సేపు కూర్చొబెట్టారు. గంటసేపు ఫ్రాన్స్లో కూర్చోబెట్టి షాపింగ్ చెయ్యడం, ఎత్తుకుని తిరగడం, బొమ్మ కుర్సీలో, ఆట బొమ్మపై కూర్చొబెట్టడం మంచిది కాదు. మూడు నెలలలోపు పిల్లలు

రోజు మొత్తంలో 14 నుంచి 17 గంటలు, పదకొండు నెలల లోపు పిల్లలైతే 12 నుంచి 16 గంటలు నిద్రపోవాలె. దీనికి వాళ్లు రోజుకు ఎన్నిసార్లు నిద్రపోయినరో ఆ మొత్తాన్ని కలపాలి. 

ఏడాది నుంచి రెండేళ్ల మధ్య

 ఏడాది నుంచి రెండేళ్ల మధ్య వయసున్న పిల్లలకు కనీసం 3 గంటలు రకరకాల ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూడాలె. రోజులో వాళ్లు ఎప్పుడు ఆడటానికి ఆసక్తి కనబరిచినా ఆడుకోనివ్వాలి. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టకూడదు. విరామం లేకుండా గంటసేపు ప్రామ్స్, కుర్చీలో కూర్చొబెట్టడం కానీ, ఎత్తుకోవడం కానీ చెయ్యకూడదు. ఏడాది వయసున్న పిల్లలు విరామం లేకుండా గంట సేపు కూర్చొని టీవీ చూడటం, స్మార్ట్ఫోన్లో ఆడటం వంటివి చేస్తే.. రాబోయే కాలంలో వాళ్లకు ప్రమాదం తప్పదు. 

ఇక రెండేళ్ల వయసు దాటిన పిల్లలను గంట కంటే ఎక్కువ ఒకే దగ్గర కూర్చోనివ్వకూడదు. గంటంటే తక్కువ కూర్చోబెడితే చాలా మంచిది. ఈ వయసు పిల్లలకు మంచి మంచి కథలు చెప్పాలె. ఇట్లు చేస్తే.. వాళ్లలో సృజనాత్మకత పెరుగుతది. రోజు మొత్తం వీళ్లు నిద్రపోయే టైం మొత్తం 11 నుంచి 14 గంటలు ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలె.

మూడు నుంచి నాలుగేళ్ల వయసు 

మూడు నుంచి నాలుగేళ్ల వయసు పిల్లలకు రోజుకు కనీసం మూడు గంటలు రకారకాల ఫిజికల్ యాక్టివిటీ ఉండాలె. 'అంతకంటే ఎక్కువే చేస్తది మా బేబీ' అంటే ఇంకా మంచిది. అయితే, ఈ మూడు గంటల్లో కనీసం ఒక గంటసేపైనా... చెమటలు కారే విధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలె. దీనికి ఎక్సర్ సైజ్ చేయిస్తదా, ఏవైనా ఆటలు ఆడిస్తదా? అనేది మీ ఇష్టం. వాళ్లకు ఆడాలనిపిస్తే.. అడనివ్వాలె. ఎగరాలనిపిస్తే ఎగరనివ్వాలె. 

ఈ వయసు పిల్లలు మంకు పట్టు పడితే.. ఫోన్ ఇచ్చో లేక టీవీ ముందో కూర్చోబెడుతుంటరు చాలామంది. అలా ఇవ్వడం వల్ల ఫోన్ మాయలో పడి గంటలు గంటలు ఒకే దగ్గర కూర్చుంటారు. వీళ్లను గంటకు మించి ఒకే దగ్గర కదలకుండా కూర్చొనివ్వడం మంచిది కాదు. ఈ వయసు వాళ్లకు చిన్న అక్షరాలు చదవడం అలవాటు. చెయ్యాలె. వీళ్లకు వీలైనన్ని ఎక్కువ కథలు చెప్పాలె. వీళ్లు రోజు మొత్తం పోయే నిద్ర 10 నుంచి 13 గంటలు ఉండాలె. అప్పుడే వాళ్లు ఆరోగ్యంగా ఉన్నట్టు.

పిల్లలకు ఆడాలనే ఉంటది. ఆడటానికి ప్రయత్నం. కూడా చేస్తరు. ఎత్తుకున్నా... ఒడిలోనించి జారి నడుస్తమంటారు. ఉరుకుతమంటరు. దొరికిన దానితో ఆడాలని చూస్తారు. కానీ, తల్లిదండ్రులే' లేడి కాళ్లు.. లేత చేతులు' అని ముద్దు చేస్తూ ఏ పని చెయ్యనియ్యరు. ప్లాస్టిక్ బొమ్మలు తీసుకొచ్చి వాళ్ల కళ్లను మాయ చేస్తారు. బలవంతంగా ఒకే చోట కూర్చొబెడతరు. స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తరు. ఇగ నాలుగేళ్లు దాటితే చదువు తప్పు ఇంకో యాక్టివిటీ ఉండదు. దీంతో చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేక రకరకాల సమస్యల బారిన పడుతున్నారు. ఏ పరిస్థితి ఇట్లనే ఉండటం బాధా మని డబ్ల్యూహెచ్ వో కామెంట్ చేసింది.