కొత్తపల్లిలో పిచ్చి మొక్కల మధ్య పల్లె దవాఖాన

‌‌  కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి పట్టణంలోని రామాలయం పక్కన బీఆర్ఎస్ హయాంలో పల్లె దవాఖానాను నిర్మించారు. దవాఖానాను ప్రారంభించకపోవడంతో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి దవాఖానాను వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.