స్మార్ట్​ మిర్రర్ .. ఇవి ఎలా పినిచేస్తాయంటే

ఇప్పుడు వాష్​రూమ్​లో పెట్టుకునే అద్దాలు కూడా స్మార్ట్​ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చేశాయి. దీన్ని వెనెటియన్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ అద్దం చుట్టూ ఎల్‌ఈడీ లైట్​ ఉంటుంది. దానివల్ల చీకట్లో చూసుకున్నా ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అద్దానికి ఉండే టచ్​ బటన్ల ద్వారా లైట్​ బ్రైట్​నెస్​ని కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో వార్మ్ లైట్​, వైట్ లైట్, మేకప్​ లైట్​ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

 డీఫాగర్ టెక్నాలజీ కూడా ఉంది. చలికాలంలో అద్దం ఫాగ్​తో నిండిపోతుంటుంది. అలాంటప్పుడు అద్దానికి ఉండే బటన్​ నొక్కితే వెంటనే ఫాగ్​ క్లియర్​ అవుతుంది. దీనికి ఉండే ఎల్​ఈడీల లైఫ్ 50,000 గంటలకు పైగానే ఉంటుంది. అంటే రోజుకు 3 గంటలు అద్దాన్ని వాడినా 45 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. 

ధర : 12,900 రూపాయలు