Beauty Tips : ఇలా ముఖం కడుక్కుంటే.. ఉన్న అందం కూడా పోయిద్ది.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

కొందరు ఎక్కువగా ముఖం కడుక్కో వడం, మర్దన చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు కొన్ని పొరపాట్లూ చేస్తుంటారు. అయితే ఆపొరపాట్లు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ముఖం కడుక్కోవడానికి, మేకప్ వేసుకోవడానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. లేదంటే చేతులకున్న మురికి, పైన పేరుకుపోయిన బ్యాక్టీరియా వంటివి చర్మంపై ప్రభావం చూపుతాయి.
  •  పొడి చర్మం వాళ్లు ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోకపో వడం మంచిది. ఎందుకంటేసబ్బులో ఉండే ఘాటైన రసాయ నాలు చర్మం మరింత పొడిబారే లా చేస్తాయి. అందుకే తేనె, అర టిపండుతో మసాజ్ చేసుకునిస్నానం చేయడం మంచిది.తరచూ మాయిశ్చరైజర్లు రాసుకోవడం, నిపుణుల సలహాతోమంచి ఫేస్ వాష్  వాడాలి.
  • చర్మం ఆకర్షణీయంగా ఉండాలని ఎక్కువగా క్లెన్సర్లు,వాడుతుంటారు.దానివల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే అప్పు డప్పుడు మాత్రమే వాటిని వాడుతూ ఆవిరి పట్టుకోవాలి.
  •  ఈ కాలంలో ముఖం శుభ్రం చేసుకోవడానికి ఎక్కువ చల్లగా. మరీ వేడిగా ఉన్న నీళ్లను వాడకపోవడమే మేలు. గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మంచిది. 
  •  స్నానంతో సంబంధం లేకుండా రోజుకు రెండు మూడు సార్లు ముఖం కడుక్కుంటే సరిపో తుంది. అదే పనిగా శుభ్రం చేసుకుంటే చర్మంపైన ఉండే నూనె గ్రంథులు పోయి పొడిబారుతుంది.
V6 వెలుగు స్పెషల్