చోరీ చేసి కారంపొడి చల్లారు : సీసీ టీవీలో బుక్కయ్యారు

నిజామాబాద్ జిల్లా : నందిపేట మండలం వెలుమల్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. మూడు ఇళ్లలో చోరీ చేసి 11 లక్షల నగదు,18 తులాల వెండి, ఇరవై తులాల బంగారం దొంగలించారు. పోలీసులు దొంగతనాన్ని పసిగట్టకుండా చోరీ చేసిన చోట కారంపొడి చల్లి జాగ్రత్త పడ్డారు దుండగులు. దొంగల తతంగం అంతా సీసీ టీవీలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. దొంగతనానికి గురైన మూడు ఇండ్లలో క్లూస్ టీం, డాగ్ స్వాడ్ తో ఆధారాలను సేకరించారు.