Health News: WHO నివేదిక ప్రకారం...ఎలాంటి ఫుడ్​ తినకూడదో తెలుసా...

స‌రైన పోష‌కాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ల‌భిస్తుంది. అయితే మారిన జీవ‌న‌విధానం వ‌ల్ల చాలామంది వివిధ అనారోగ్య ఆహార ప‌దార్థాల‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటూ స‌మ‌స్యల బారిన ప‌డుతున్నారు. అందుకే  WHO గుర్తించిన అన్‌హెల్తీ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.

ALSO READ | Good Health: జున్ను తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

ఒక వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా, ఫిట్‌గా ఉంటున్నారంటే అందుకు వారు తీసుకునే ఆహారాలు కూడా కారణం అవుతుంటాయి. అలాగే కొన్ని రకాల సమస్యలకు కూడా అవి దోహదం చేస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. డబ్ల్యుహెచ్‌ఓ ప్రకారం కూడా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం ఒబేసిటీ, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు దారితీస్తు్న్నాయి. 

  • పిజ్జా, బ‌ర్గర్‌ : పిజ్జా, బ‌ర్గర్‌లో కేల‌రీలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల‌్ల శ‌రీర బ‌రువు పెర‌గ‌డంతోపాటు ఊబ‌కాయ స‌మ‌స్య కూడా వ‌చ్చే ప్రమాదం ఉంది.
  • కాఫీ: ఇందులో కెఫిన్ అధికంగా ఉండే కాఫీ రోజూ తాగితే త‌ల‌నొప్పి, ఒత్తిడి, హై బీపీ వంటి ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తుతాయి. మితంగా తీసుకోవడం మేలు.
  • పంచ‌దార‌ : షుగ‌ర్‌తో చేసే ఫుడ్స్ తింటే డ‌యాబెటిస్ వ‌చ్చే ప్రమాదం ఎక్కువ‌గా ఉంది. అందుకే షుగ‌ర్‌తో చేసే స్వీట్స్‌, ఫుడ్స్ వీలైనంత త‌క్కువ‌గా తీసుకోవాలి.
  • పామాయిల్‌: పామాయ‌ల్‌లో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఈ ఆయిల్‌తో చేసే వంట‌కాలు తిన‌డం వ‌ల‌్ల డ‌యాబెటిస్‌, గుండె స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది.
  • ఫ్రై ఫుడ్స్‌: ఫ్రై ఫుడ్స్‌ను వీలైనంత త‌క్కువ‌గా తీసుకోవాల‌ని WHO సూచిస్తుంది. డీప్ ఫ్రై చేసి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  • ఉప్పు: మ‌నం చేసే వంట‌కాల‌లో ఉప్పును మితంగా వాడాలి. ఉప్పులో ఉండే సోడియం వ‌ల‌్ల దీనిని అతిగా తీసుకుంటే ప్రమాద‌మే.
  • పొటాటో చిప్స్‌ : ఫ్రెంచ్ ఫ్రైస్‌, పొటాటో చిప్స్ వంటి స్నాక్స్‌ను కూడా వీలైనంత వ‌రకు తిన‌డం త‌గ్గించాలి.
  • బాయిలింగ్ ఫుడ్స్ : నిజానికి నూనెలో ఎక్కువగా వేయించిన ఆహారాలలో ఉప్పు, కారం, నూనె ఎక్కువస్థాయిలో ఉంటాయి. కెలరీలు, అన్‌హెల్తీ కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు సహా వివిధ అనారోగ్యాలకు దారితీస్తాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి డబ్ల్యుహెచ్‌ఓ కూడా పేర్కొన్నది.
  • రిఫైన్డ్ ఫుడ్స్ : పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి షుగరింగ్ స్నాక్స్‌లో ఉండే రిఫైన్డ్ కార్బో హైడ్రేట్లు అన్‌హెల్తీ ఫుడ్స్ జాబితాలో ఉన్నాయి. ఇవి రక్తంలో షుగర్ అండ్ ఇన్సులిన్ లెవల్స్‌ను పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి ఎక్కువగా ప్రాసెస్ చేయడినవి కాకుండా తృణ ధాన్యాలు, బార్లీ, మిల్లెట్స్ వంటి కార్బో హైడ్రేట్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.
  •  సాసేజ్ : పంది మాంసం, సాసేజ్ వంటి అధికంగా ప్రాసెస్ చేసిన మాంసాలలో కూడా సోడియం, నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రిస్కును పెంచుతాయి. జీర్ణ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి వాటిని తీసుకోకపోవడం మంచిది. డబ్ల్యుహెచ్‌ఓ కూడా రిస్క్ ఆహారాల జాబితాలో పేర్కొన్నది.