రెండో జతా లొడాసే .. యూనిఫామ్​ కోసం 4.89 లక్షల మీటర్ల క్లాత్ సప్లై

  • స్టిచ్చింగ్​కు మహిళా సంఘాలకు  అప్పగింత
  • ధరించలేని విధంగా స్కూల్​యూనిఫామ్ ​తయారీ
  • సివిల్​ డ్రెస్​లో స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు

అధికారుల పర్యేవేక్షణ లేకపోవడంతో పిల్లల స్కూల్​ యూనిఫామ్​ కోసం  మహిళా సంఘాలకు సప్లై చేసిన క్లాత్​ వృథా అయ్యింది.  సరైన కొలతలతో స్టిచింగ్​  చేయకపోవంతో స్టూడెంట్స్​ ధరించలేని విధంగా ఉండటంతో పిల్లలు ధరించేందుకు ఇష్టపడటం లేదు. మొదటి జత యూనిఫామ్​ లాగే రెండో జత కూడా ఉండటంతో రీస్టిచింగ్​ కోసం పేరెంట్స్​ టైలర్లకు ఇస్తున్నారు. కొన్ని చోట్ల టీచర్లు చందాలు వేసుకొని యూనిఫామ్​ రెడీ చేస్తున్నారు. 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని సర్కారు బడి పిల్లల కోసం పంపిన రెండో జత యూనిఫామ్​ కూడా లోపభూయిష్టంగా స్కూళ్లకు చేరాయి.  సరైన కొలతలతో స్టిచ్చింగ్​ చేయకపోవంతో స్టూడెంట్స్​వీటిని ధరించే వీలులేకుండా ఉంది.  ఇష్టారీతి కొలతలతో స్టిచ్చింగ్​ చేసిన నిక్కర్లు , ప్యాంట్, అంగీలు సరఫరా చేశారు. మొదటి జత యూనిఫారాలు స్టిచ్చింగ్​ చేసిన విధంగానే రెండవ జత యూనిఫారాలు పంపించారు. 

సరైన కొలతలు లేకుండా..

జిల్లాలో 693 ప్రైమరీ స్కూల్స్​, 116 అప్పర్​ ప్రైమరీ,  230 హైస్కూల్స్,  25 కేజీబీవీలు, 10 ఆదర్శ పాఠశాలలు  కలిపి మొత్తం 1,074 స్కూల్స్​ ఉన్నాయి.  వీటిలో 60,355 బాయ్స్​, 51,906 గర్ల్​ స్టూడెంట్స్​ ఉన్నారు. 1 నుంచి 12 తరగతి చదివే పిల్లలకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాలని సంకల్పించిన గవర్నమెంట్​4.89 లక్షల మీటర్ల క్లాత్  పంపింది. స్టిచ్చింగ్​ కోసం మహిళా సంఘాలకు ఇచ్చారు.  సరైన కొలతలతో యూనిఫారాలు కుట్టకపోవడంతో  మొదటి జత పాడయ్యాయి. రెండో జత విషయంలోనూ ఆఫీసర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మొదటి జత లాగే పది రోజుల కింద  స్కూల్స్​కు చేరాయి. 

1 నుంచి 3 క్లాస్​ పిల్లలకు పంపిణీ చేసిన నిక్కర్లు కొన్ని పొట్టిగా, కొన్ని పొడవుగా,  అంగీలు బిర్రు ఉన్నాయి. 4 నుంచి 7 క్లాస్​ పిల్లలకు రెండు సైజుల్లో మళ్లీ పంపారు. 8 నుంచి 10  స్టూడెంట్స్​కోసం పంపిన ప్యాంట్, షర్ట్​లు వంకరటింకర సైజుల్లో ఉన్నాయి. 1-3 మంది అమ్మాయిల కోసం రెడీ చేసిన ఫ్రాకులు, 4,5 క్లాస్​ బాలికలకు స్కర్ట్స్​, 6 నుంచి 12 తరగతి గర్ల్స్​కు చుడీదార్లు​ కూడా ధరించ వీలులేని రీతిలో పంపగా వాటినే స్టూడెంట్స్​కు పంపిణీ చేశారు.

 సరైన కొలతలు లేనందున మొదటి జత మాదిరే వచ్చిన రెండవ జతను వేసుకోడానికి స్టూడెంట్స్ ఇష్టపడటంలేదు.  బాలికల ఓణి క్లాత్​ 864 మీటర్లు మినహా షర్ట్​, ప్యాంట్, స్కర్ట్స్​కోసం గవర్నమెంట్​ పంపిన క్లాత్​  వేస్ట్​అయింది. పైగా కట్టింగ్​ లోపాలతో 6 వేల మీటర్ల క్లాత్​ షార్టేజ్​ ఏర్పడింది. దాని కోసం ఇన్​డెంట్​ పంపారు. 

ఈ యాడాదికి ఇంతే 

ఒక విద్యా సంవత్సరంలో రెండు జతల యూనిఫామ్​ మాత్రమే స్టూడెంట్స్​కు ఇస్తారు. ఇచ్చిన రెండు జతలూ ధరించడానికి వీలులేకుండా ​ ​ఉండడంతో పిల్లలు సివిల్​ డ్రెస్​లోనే బడులకు వస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల టీచర్లు చందాలు వేసుకొని పిల్లలకు జత యూనిఫామ్​ రెడీ చేస్తున్నారు.  నవీపేట మండలం బినోల హైస్కూల్ టీచర్లు ​రూ.60 వేలు చందాలు వేసుకొని 200 మంది స్టూడెంట్స్​కు యూనిఫామ్​, టై, బెల్ట్, షూ, సాక్స్​ అందజేశారు.  మహిళా సంఘాల నుంచి సప్లై అయిన వాటిలో లూజ్​ డ్రెస్​లను పిల్లలకు అనువైన సైజ్​ చేయించడానికి కొంతమంది పేరెంట్స్​ టైలర్లకు ఇచ్చారు.